సరిదిద్దుకోవాలె.!సగంలో ఎట్ల చెప్తం.?కేసీఆర్ ప్రెస్ మీట్ రద్దైంది అందుకే.?
హైదరాబాద్ : మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విలేఖరుల సమావేశం నిర్వహించి కొత్త సంవత్సరంలో అనేక కొత్త అంశాలు చెప్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సీఎం చంద్రశేఖర్ రావు అనూహ్యనిర్ణయం తీసుకున్నారు. తూచ్ ప్రెస్ మీట్ లేదు ఏం లేదని సీఎం మీడియా కార్యాలయ సిబ్బందితో చెప్పించారు. సీఎం మీడియా సమావేశాన్ని రద్దుచేసుకోవడానికి కారణాలేంటని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మంత్రులు మీడియాలో ప్రాచూర్యం కోసం ప్రయత్నాలు.. మందలించిన సీఎం
కొందరు మంత్రల పని తీరు, ధరణి పోర్టల్, థర్డ్ ఫ్రంట్, బీజేపి ని విమర్శించడం, బండి సంజయ్ అరెస్ట్ వంటి అంశాలు సీఎం చంద్రశేఖర్ రావు కు శరాఘాతంగా పరిణమించినట్టు తెలుస్తోంది. ఇటీవల చంద్రశేఖర్ రావు బీజేపి పై సంధించిన విమర్శనాస్త్రాలు అనుకూల ఫలితాలను ఇవ్వక పోగా ప్రభుత్వానికి హానికరంగా పరిణమించాయి. మంత్రులు క్షేత్ర స్థాయిలో పనిచేయకుండా మీడియాలో ప్రాచూర్యం కోసం ప్రయత్నాలు చేస్తున్రారని, ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టమని సీఎం చంద్రశేఖర్ రావు కొంత మంది మంత్రులను క్యాబినెట్ భేటలో తీవ్రండా మందలించినట్టు తెలుస్తోంది.

ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.. తక్షణం లోపాలను సవరించాలన్న సీఎం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా దాని వల్ల ప్రభుత్వానికి ప్రతికూల వాతావారణం ఎదురయ్యిందని, చాలా వరకూ ప్రజలు ధరణి పోర్టల్ వల్ల నిరుత్సాహంగా ఉన్నారని సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ పై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నెలల తరబడి ధరణి పోర్టల్ లో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పొరపాట్లు, నిర్లక్ష్యం లేకుండా జవాబుదారీ తనండా పోర్టల్ ను ప్రక్షాళన చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది.

మూడో కూటమి సున్నితనమైన అంశం.. స్పందిస్తే తేడా వస్తుంది.. అందుకే ప్రెస్ మీట్ రద్దు
అంతే కాకుండా ముఖ్యమంత్రి ఇటీవల దేశంలో మూడో కూటమి గురించి చేసిన ప్రయత్నాలు కూడా ఇబ్బందికరంగా పరిణమించాయి. జాతీయ పార్టీల గురించి చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో విలేఖరులు థర్డ్ ఫ్రంట్ గురించి ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పాలన్న సంధిగ్దంలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాలకు సంబందించిన సున్నితనమైన అంశం కాబట్టి దాని గురించి ఏమీ స్పందించకుండా ఉంటేనే మేలనుకున్న సీఎం విలేఖరుల సమావేశాన్ని రద్దు చేసేందుకు అదొక కారణంగా తెలుస్తోంది.

బీజేపిని విమర్శిస్తే అది బీజేపికి మైలేజ్.. అందుకు ప్రెస్ మీట్ వద్దనుకున్న సీఎం
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపిని తారా స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. కారణం ఉన్నా లేకున్నా బీజేపిని దూషిస్తే ఒరిగేది ఏందని సీఎం భావించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపిని విమర్శిస్తే అది బీజేపికి మంచి మైలేజ్ వస్తుంది కాని పార్టీకి ఏమాత్రం పనికి రావడం లేదని సీఎం అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. మీడియా సమావేశం నిర్వహిస్తే కేంద్ర బీజేపితో సహా రాష్ట్ర బీజేపిని కూడా విమర్శించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యలో సీఎం ప్రజా సమస్యలు, సంక్షేమం కన్నా రాజకీయ ఆరోపణల కోసం మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ప్రెస్ మీట్ రద్దు చేసుకోవడానికి ఇదొక కారణమని ప్రగతిభవన్ వర్గాలు స్పష్టం చేసాయి. సీఎం చంద్రశేఖర్ రావు విలేఖరుల సమావేశం రద్దవ్వడానికి అసలు కారణాలు ఇవేనని తెలుస్తోంది.