• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ‌కీయాల్లో ఉండాలంటే ధ‌నం చాలా అవ‌స‌రం..! డ‌బ్బుల కోసం జ‌గ్గారెడ్డి సంపాద‌న యాత్ర‌..!!

|

హైద‌రాబాద్ :కాంగ్రెస్ పార్టీ నేత జ‌గ్గారెడ్డి అలియాస్ తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి వ్య‌వ‌హార శైలి చాల భిన్నంగా ఉంటుంది. తాను మాట్లాడే విధానం ద‌గ్గ‌ద‌ర‌నుండి బాడి లాంగ్వేజ్ వ‌ర‌కు చిత్రంగా ఉంటుంది. ఇక మైక్ తీసుకుని ప‌బ్లిక్ మీటింగుల్లో మాట్ల‌డుతుంటే మ‌రీ ఆస‌క్తి క‌లుగుతుంటుంది. తాము వ‌చ్చిన నేప‌థ్యం ఏటి..? ఏ మాట్లాడాలి..? వ‌ఏదిక మీద ఎవ‌రు ఉన్నారు అనే అంశాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు.

 జ‌గ్గారెడ్డి

జ‌గ్గారెడ్డి

తాము చెప్పాల‌నుకున్న‌ది ప్ర‌జా స‌మ‌క్షంలో చెప్పి ఓ ప‌నైపోయింది అన్న‌ట్టు అక్క‌డ నుండి నిష్క్ర‌మిస్తారు. తాజాగా ఇలాగే ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడి కార్య‌క‌ర్త‌ల‌తో ఔరా అనిపించ‌కున‌నారు జ‌గ్గారెడ్డి. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఆస్తులు అమ్ముకోనైనా

ఆస్తులు అమ్ముకోనైనా

అస‌లు ట్విస్టు ఇక్క‌డే మొద‌లైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా విజయం సాధించినప్ప‌టికి త‌న వద్ద డబ్బులు లేవని, సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులు ఆస్తులు అమ్ముకోనైనా, అప్పులు చేసైనా విజయం సాధించాలని అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తులను, అప్పులు చేసే స్థాయి ఉన్న వారిని సర్పంచి అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బాగా డబ్బులు అవసరమని, వాటిని సమకూర్చుకునేందుకు తాను దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తానన్నారు.

యాత్ర‌ల‌కు వెళ్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు

యాత్ర‌ల‌కు వెళ్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు

అంతే కాకుండా తాను ఆరు నెలల వరకు అందుబాటులో ఉండబోనని, గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు తన భార్య, కాంగ్రెస్‌ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. అంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చే క్ర‌మంలో కావ‌ల‌సిని మూల‌ధ‌నం కోసం తాను సంపాద‌న యాత్ర‌ల‌కు వెళ్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు జ‌గ్గారెడ్డి. తాను పార్టీ మారుతున్న‌ట్టు వస్తున్న వార్తలను జగ్గారెడ్డి ఖండించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
sangareddy congress mla said, "We need to make good money to fulfill the guarantees given to the cadres during the election and will make contracts to Congress ruled states across the country. Apart from that, jaggareddy will not be available for six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more