• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రియుడితో జల్సాల కోసం బడాబాబును గాలమేసి పెళ్లిచేసుకుని, ఆపైన దొంగతనాలు చేస్తూ...

By Ramesh Babu
|

హైదరాబాద్: తన ప్రియుడితో కలిసి జల్సా జీవితం అనుభవించేందుకు ఓ యువతి ఏకంగా ఓ బడాబాబుకు గాలమేసి పెళ్లి చేసుకుంది. ఆనక అతడి ఇంటినుంచి ఒక్కో వస్తువునూ దొంగతనం చేస్తూ.. చివరికి దొరికిపోయి కటకటాలపాలైంది.

షాకింగ్: జస్ట్ మూడు గంటల్లో.. రూ.50 లక్షలు నొక్కేసిన నయా కి'లేడీ'లు!

వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పావని(28)కి హైదరాబాద్ అంబర్ పేటలో ఉండే కిషోర్ అనే యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సట్టా నిర్వహించే కిషోర్‌ను ఇష్టపడిన పావని, అతన్ని పెళ్లిచేసుకోవాలని భావించింది.

12 ఏళ్ల విద్యార్థినిని ఆరు రోజుల పాటు 14 మంది తోటి విద్యార్థులు...

ప్రియుడితో జల్సాలు చేయడం కోసం...

ప్రియుడితో జల్సాలు చేయడం కోసం...

తన ప్రియుడైన కిషోర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన పావని ఆ క్రమంలో అతడికి పలుమార్లు డబ్బులు కూడా ఇచ్చింది. ఇద్దరూ కలిసి సట్టా కోసం అప్పుడప్పుడు ముంబై వెళ్లి అక్కడ జల్సా చేసి వస్తుండేవారు. గతంలో కూడా టర్కీ కరెన్సీని సరఫరా చేస్తూ పావని పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చింది.

 బాగా డబ్బున్న యువకుడికి గాలమేసి...

బాగా డబ్బున్న యువకుడికి గాలమేసి...

కొంతకాలానికి డబ్బుల సర్దుబాటు కష్టతరంగా మారడంతో పావని కొత్త ప్లాన్ వేసింది. ఆర్థికంగా బాగా స్థిరపడిన రమేష్ అనే యువకుడికి గాలం వేసింది. అతడు ఆమె ఆకర్షణలో చిక్కుకోగానే అదే అదనుగా రమేష్‌ను పెళ్లి చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రమేష్‌‌కు దక్షిణాఫ్రికాలో ఉద్యోగం రావడం పావనికి బాగా కలిసొచ్చింది.

డబ్బు కోసం తన ఇంట్లో తానే చోరీలకు పాల్పడి...

డబ్బు కోసం తన ఇంట్లో తానే చోరీలకు పాల్పడి...

ఆ తరువాత పావనికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తన ప్రియుడైన కిషోర్‌తో కలిసి మళ్లీ జల్సాలు మొదలెట్టింది. ఈ జల్సాలకు అవసరమయ్యే డబ్బుల కోసం పావని తన ఇంట్లోనే పలుమార్లు చోరీలకు పాల్పడింది. ఇలా చోరీల ద్వారా వచ్చిన డబ్బును పావని తీసుకెళ్లి తన ప్రియుడైన కిషోర్‌కు ఇచ్చేది.

 ఉమెన్ హాస్టల్లో చేరి, మళ్లీ...

ఉమెన్ హాస్టల్లో చేరి, మళ్లీ...

పావని చేస్తున్న పనులను గమనించిన రమేష్ కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోంచి గెంటేశారు. అయినా పావనిలో మార్పు రాలేదు. నకిలీ గుర్తింపు కార్డు చూపించి అమీర్‌పేటలోని ఓ ఉమెన్ హాస్టల్లో చేరి, పలువురు యువతులతో స్నేహం చేసింది.

బండారం ఇలా బయటపడింది...

బండారం ఇలా బయటపడింది...

ఉష అనే యువతి బీరువాలోంచి ఏడు తులాల బంగారం దొంగిలించి, దాన్ని అమ్మి సొమ్ముచేసుకుని ప్రియుడు కిషోర్‌తో కలిసి ముంబై వెళ్లి జల్సా చేసి వచ్చింది. పావనిపై అనుమానం కలిగిన ఉష ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఈ గుట్టంతా లాగారు. అనంతరం పావనిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

English summary
To experience the rich life with her lover, a 28 year old woman attracted a well settled person and married him. After that she continued her illegal activities. For the sake of money many times she stolen things from her own house and sold them out. With that money she enjoyed with her lover. At last she was caught by her in-laws, when they thrown her from their house, she came and joined in a women hostel at Ameerpet and continued her illegal activites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X