హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుర్రాలపై కార్యాలయాలకు టెక్కీలు, ఎందుకంటే?

ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు వెళ్ళే రోడ్డు తవ్వకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టెక్కీలు నిరసన వ్యక్తం చే్స్తున్నారు. రోడ్డు తవ్వకానికి వ్యతిరేకంగా టెకీలు ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ను కూడ నిర్వహిస్తున్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు వెళ్ళే రోడ్డు తవ్వకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టెక్కీలు నిరసన వ్యక్తం చే్స్తున్నారు. రోడ్డు తవ్వకానికి వ్యతిరేకంగా టెకీలు ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ను కూడ నిర్వహిస్తున్నారు.

అయితే ఈ క్యాంపెయిన్‌పై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వినూత్న రీతిలో టెక్కీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము పనిచేస్తున్న కార్యాలయాలకు వాహనాల్లో కాకుండా గుర్రాలపై వెళ్థూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

To Protest Bad Roads, Hyderabad Techies Rode Horses To Work

ప్రస్తుతమున్న తారు రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని టెక్కీలు కోరుతున్నారు. వచ్చే మూడు నుండి నాలుగేళ్ళలోపుగా ప్రస్తుతమున్న తారురోడ్డుకు ఎలాంటి ఇబ్బందులు ఉండని వారు చెబుతున్నారు.

ఈ రోడ్డు తవ్వడం వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో పనిచేసే ఉద్యోగులు తాము పనిచేసే కార్యాలయాలకు వెళ్ళాలంటే మరో రెండు నుండి మూడు గంటల సమయం అధికంగా కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లు చాలానే ఉన్నాయని, వాటిని ముందు మరమ్మత్తులు చేయాలని వారు కోరుతున్నారు.

English summary
After their online campaign to protest against a stretch of road being dug up in Hyderabad failed to attract the attention of tech-savvy IT minister KT Rama Rao and the municipal administration department, a group of techies have taken up an innovative method to register their protest - ride horses to work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X