తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 1,380 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడుతుంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదయిన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 68, 720 శాంపిల్స్ పరీక్షించారు. వారిలో 1,380 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీలో 350 మందికి కరోనా
తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 7,78,910కు చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఒకరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,877 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ రేటు 96.39 శాతం ఉంది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా క్రమేనా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 350 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం
తెలంగాణలో
కరోనా
వ్యాక్సినేషన్
డ్రైవ్
వేగవంతంగా
పూర్తి
చేయాలని
ఆరోగ్యశాఖ
మంత్రి
హరీశ్
రావు
అధికారులను
ఆదేశించారు.
వీలైనంత
తొందరగా
అన్ని
కేటగిరీల
వాళ్లకూ
100
శాతం
వ్యాక్సినేషన్
అయ్యేలా
చూడాలని
సూచించారు.
వ్యాక్సినేషన్
తక్కువగా
జరుగుతున్న
మండలాలపై
దృష్టి
పెట్టాలన్నారు.
రాష్ట్రంలో
కరోనా
కేసులు,
ఫీవర్
సర్వే,
వ్యాక్సినేషన్‌పై
అధికారులతో
మంత్రి
హరీశ్
రావు
సమీక్షించారు.
31
జిల్లాల్లో
పెద్దోళ్లందరికీ
100
శాతం
ఫస్ట్
డోస్
టీకాలు
పూర్తయిందని
తెలిపారు.

ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు
రాష్ట్రంలో 60 ఏండ్లు నిండిన వారు, ఇతర జబ్బులతో బాధపడేవాళ్లు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రికాషన్ డోసు, టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సినేషన్ అన్ని జిల్లాల్లో 100 శాతం పూర్తి కావాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. తద్వారా కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో తొలి రౌండ్ సర్వే పూర్తి కాగా.. రెండో రౌండ్ సర్వే కొనసాగుతోందని చెప్పారు. కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని హరీశ్ కోరారు.