వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్త్ డే రోజు ఆజ్ఞాతంలో ట్రబుల్ షూటర్ .. విషెస్ చెప్పిన కేటీఆర్, క్లాస్ పీకుతున్న నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదినం నేడు. కానీ ఆయన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎవరికీ అందుబాటులో ఉండనని, వేడుకలు చేసుకోవాలంటే జరుపుకోవాలని తన అభిమానులకు సూచించారు. దీంతో హరీశ్‌రావు అభిమానులు జన్మదిన వేడుకలు చేసుకున్నారు. భారీ కేక్ కట్ చేసి తమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలకు దూరం ..

వేడుకలకు దూరం ..

బర్త్ డే వేడుకలకు ఈసారి మరింత దూరంగా ఉన్నారు హరీశ్‌రావు. తాను బర్త్ డే జరుపుకొనేందుకు అందుబాటులో ఉండనని హితులు, సన్నిహితులకు స్పష్టంచేశారు. దీంతో సిద్దిపేట, హైదరాబాద్‌లో హరీశ్ అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. భారీ కేక్ కట్ చేసి తమ నేతకు శుభాకాంక్షలు తెలిపారు. తమతో అభిమాన నేత లేకున్నా .. తప్పని పరిస్థితుల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. పార్టీలో హరీశ్‌ను తగ్గించడంతోనే ఆయన బర్త్ డే వేడులని హంగు, ఆర్బాటం చేయలేదని అభిమానులు విమర్శిస్తున్నారు.

కేటీఆర్ విషెస్ .. మండిపడ్డ నెటిజన్లు

హరీశ్ బర్త్ డే సందర్భంగా బావమరిది, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తన 'బావకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీశ్ గారూ ... మంచి ఆరోగ్యం నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు. సుఖ, సంతోషంగా ఉంటూ .. ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా‘ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. డైనమిక్ లీడర్‌కు మంత్రి పదవీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గించి .. పైకి శుభాకాంక్షల అంటూ మరికొందరు నెటిజన్లు ఘాటుగా రీ ట్వీట్ చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం లేకుండా చేశారని దుమ్మెత్తిపోశారు. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరనలో హరీశ్‌కు బెర్త్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉవ్వెతున్న ఎగిసిపడ్డ కెరటం

ఉవ్వెతున్న ఎగిసిపడ్డ కెరటం

తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించారు హరీశ్. కేసీఆర్ తర్వాత మహొద్యమంలో పాల్గొన్నది ఆయనే. అందుకు తగ్గ పేరు కూడా వచ్చింది. అయితే తొలి విడత మంత్రివర్గంలో కీలకమైన నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పదవీ కూడా దక్కింది. కానీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే కొద్దీ పార్టీలో ప్రాధాన్యాలు మారుతున్నాయి. క్రమంగా హరీశ్‌ను తగ్గిస్తూ వస్తున్నారు. అంతకుముందు సభల నిర్వహణ, ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకొని గెలిపించేవారు హరీశ్. కానీ పార్టీ బాధ్యతలు అప్పగించకపోవడంతో తాను కూడా మిన్నకుండిపోయారు. మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవీ ఇవ్వకున్నా .. వ్యతిరేక గళం వినిపించలేదు. సీఎం కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను క్రమశిక్షణ గల టీఆర్ఎస్ సైనికుడిలా నెరవేరుస్తానని తెలిపారు. తన అభిమానులు ఎక్కడ హద్దుమీరుతారోనని మీడియా ముందుకొచ్చి మరీ చెప్పారు. అప్పటినుంచి పరిస్థితిలో ఏ మార్పులేదు. హరీశ్ పేరు లేకుండా చేసే కుట్ర జరుగుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న హరీశ్ .. మాత్రం నోరుమెదిపి పార్టీపై గానీ, కేసీఆర్‌పై గానీ నోరెత్తలేదు.

తగ్గించారు .. అయినా దరహాసమే ...

తగ్గించారు .. అయినా దరహాసమే ...

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా వలసవాదుల పాలన నుంచి విముక్తి కల్పించాలని గోంతెత్తి అరిచిన ధీశాలి హరీశ్‌రావు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు ఆరాటపడిన ధీశాలి. కానీ ఓ కెరటం ఉవ్వెతున ఎగిసిపడుతుంటే .. కృత్రిమంగా ఆపారని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ పార్టీలో ప్రాధాన్యం తగ్గించినా .. క్యాబినెట్‌లో చేర్చుకోకున్నా హరీశ్ మాత్రం తన మొములో చిరుదరహాసం ఎప్పుడూ వీడలేదు. తన ప్రయారిటీ తగ్గించినా .. మిన్నకుండిపోయాడే తప్ప .. ఇదేంటి అని ప్రశ్నించలేదు. కానీ ఆయన అభిమానులు మాత్రం గులాబీ దళాన్ని ధిక్కరించి ప్రశ్నిస్తున్నారు. తమ నేతను పక్కనపెట్టారని మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జన్మదిన వేడుకలనీ ఆర్బాటం చేస్తే బాగుండదని, పార్టీని వ్యతిరేకించినట్టవుతుందని .. బర్త్ డే వేడుకలకు హరీశ్ దూరంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary
TRS senior leader and former minister Harish rao birthday today. But he was away from birthday celebrations. He told his fans not to be available to anyone and to celebrate. Harish fans celebrated the birthday celebrations. Cut a huge cake and congratulate their leader on the birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X