వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు, రేపు వడగాల్పులు..! గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎండలో గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!! || Oneindia Telugu

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎడారి ప్రాంతంలో వచ్చే వేడి సెగలను మరిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నేడు, రేపు కూడా వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, రాయసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. బయట ఎండ తీవ్రంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

 నిప్పుల కొలిమిగా మారిన తెలుగు రాష్ట్రాలు..!

నిప్పుల కొలిమిగా మారిన తెలుగు రాష్ట్రాలు..!

రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా నుంచి రాయసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరిత ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అయితే నేడు గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు భయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ కు నెల తర్వాత చల్లటి కబురు..!

తెలంగాణ కు నెల తర్వాత చల్లటి కబురు..!

తెలంగాణ కు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. జూన్ 8 నుంచీ నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని వారు చెప్పారు. జూన్ 8 అంటే... దాదాపు మరో నెల పాటూ తెలంగాణ ప్రజలు ఈ ఎండలను భరించాల్సిందే. అసలే మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సమయంలో... ఇంకో నెల పాటూ భయంకరమైన ఎండలు ఉంటే... ప్రజలు తట్టుకోగలరా అన్నదే ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది.

ఉదయం పదింటికే మండుతున్న ఎండ..!

ఉదయం పదింటికే మండుతున్న ఎండ..!

ఇంకా రోహిణీ కార్తె రాలేదు. ఇప్పటికే ఎండలు ఇలా ఉన్నాయంటే... అది వస్తే... ఇంకెంత భయంకరంగా ఉంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఈ రుతుపవనాలపై ఇండియా-జర్మనీ కలిసి అధ్యయనం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగమైన పాట్స్ డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ఈ నైరుతీ శుభవార్త తెలిపింది. జూన్ 8 నుంచీ జూన్ 16 మధ్యలో తెలంగాణలో వానలు పడతాయని చెప్పింది. ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే... వాళ్లు ఓ టెక్నిక్ ఉపయోగించారు.

తెలంగాణలో వేడి గాలులు..!

తెలంగాణలో వేడి గాలులు..!

2016లో టిప్పింగ్ ఎలిమెంట్ విధానం ఒకటి ప్రయోగాత్మకంగా పరిశీలించి సక్సెస్ అయ్యారు. తూర్పు కనుమలు, తూర్పు దక్షిణ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమ ప్రాంతం, ఉత్తర తెలంగాణ కేంద్రంగా తాజాగా ఓ అధ్యయనం జరిపి లెక్కలేశారు. తెలంగాణలో మరో 24 గంటల పాటూ విపరీతమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందట. కాబట్టి, తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

English summary
Telangana and Andhra regions today, tomorrow will continue to be high temperatures, the weather department warns. Especially in northern Telangana, eastern Telangana and Rayalaseema regions. The authorities are warning that the outside will be sunny and the people should alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X