వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుంచి టోల్ ట్యాక్స్, ప్రత్యామ్నాయంగా స్వైపింగ్: రోడ్లపై చిల్లర కష్టాలు తప్పవా?

నోట్ల రద్దు అనంతరం టోల్ ట్యాక్స్ వసూలును నిలిపివేశారు. డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి తిరిగి టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: నోట్ల రద్దు అనంతరం టోల్ ట్యాక్స్ వసూలును నిలిపివేశారు. డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి తిరిగి టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పైన తిరిగి టాక్స్‌లు వసూలు చేస్తారు.

బంగారంపై దుష్ప్రచారం, వాటి పైనే పన్ను: జైట్లీబంగారంపై దుష్ప్రచారం, వాటి పైనే పన్ను: జైట్లీ

నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నేపథ్యంలో వాహనదారులకు చిల్లర కష్టాలు తప్పించేందుకు టోల్ ట్యాక్సు వసూలును నిలిపివేశారు.

తొలుత నవంబర్ 11 వరకు టోల్ ట్యాక్స్ నిలిపివేశారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు పొడిగించారు. నవంబర్ 14వ తేదీకి, 18వ తేదీకి, 24వ తేదీకి పొడిగించారు. చివరగా డిసెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు. రేపు డిసెంబర్ 2వ తేదీ. రేపు అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు చేస్తారు.

toll tax

కాగా, టోల్ ప్లాజా వద్ద రూ.2000లు ఇస్తే చిల్లరకు సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నారు. తద్వారా వాహనదారులకు చిల్లర కష్టాలు లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది. అయినప్పటికీ ఇబ్బందులు ఎంతోకొంత ఉండే అవకాశాలున్నాయి. ఏటీఎంల నుంచి రూ.2000 నోట్లు మాత్రమే ఎక్కువగా వస్తోన్న విషయం తెలిసిందే.

కొన్ని ముఖ్యమైన జాతీయ రహదారులు

ఏపీలో.. ఎన్‌హెచ్ (జాతీయ రహదారి) 65 తడ - శ్రీకాకుళం, హైదరాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వే, కర్నూలు - బెంగళూరు, కర్నూలు - కడప రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే, కోదాడ - విజయవాడ, ఏలూరు - తణుకు రహదారులు. తెలంగాణలో.. అదిలాబాద్ - కర్నూలు, హైదరాబాద్ - రాయగిరి- వరంగల్, హైదరాబాద్ - దామరచర్ల తదితరాలు ఉన్నాయి.

English summary
Toll collection on all National Highways is all set to resume after midnight of December 2. Toll collection on all National Highways and some State Highways was suspended after the demonetisation announcement in a bid ease cash crunch for commuters but after an extension of suspension it is all set to from December 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X