వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ కేసు: వ్యూహాత్మకంగా 'సిట్', బయటకు వస్తోన్న పేర్లు, ఇక వారికి సినిమానే?

సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహరం ఓ కుదుపు కుదిపేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు నుండి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు, తాజాగా సుబ్బరాజుల

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహరం ఓ కుదుపు కుదిపేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు నుండి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు, తాజాగా సుబ్బరాజుల నుండి సిట్ అధికారులు సమాచారాన్ని సేకరించారు. వీరిచ్చిన సమాచారంతో సినీ ఇండస్ట్రీలో మరికొందరి ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఇంకా మరికొందరి పేర్లను సుబ్బరాజు బయటపెట్టినట్టు సమాచారం.

బిగుస్తున్న ఉచ్చు: కీలక సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు, వారికి దెబ్బేనా?బిగుస్తున్న ఉచ్చు: కీలక సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు, వారికి దెబ్బేనా?

మూడురోజులుగా సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు, సినీ నటుడు సుబ్బరాజులను ద్వారా సమాచారాన్ని అధికారులు సమాచారాన్ని సేకరించారు.

అయితే సుబ్బరాజు సినీ ఇండస్ట్రీ గుట్టువిప్పుతున్నట్టు సమాచారం. కీలకమైన సమాచారాన్ని సుబ్బరాజు వెల్లడించినట్టుగా సిట్ అధికారులు వెల్లడించారు. అయితే నిర్థీత సమయం తర్వాత ఇంకా ఆయన విచారణను కొనసాగించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్

ఈ కేసులో సిట్ అధికారులు వ్యూహత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఒక్కోక్కరి నుండి ఒక్కో రకమైన సమాచారాన్ని సేకరించారు. పూరీ బ్యాచ్ ఇచ్చిన సమాచారం మేరకే సినీ ఇండస్ట్రీలో ఇంకా మరికొందరి పేర్లను రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.

10 గంటలపాటు పూరీ జగన్నాధ్ విచారణ, కీలక సమాచారం వెల్లడి10 గంటలపాటు పూరీ జగన్నాధ్ విచారణ, కీలక సమాచారం వెల్లడి

వ్యూహాత్మకంగా సిట్ అధికారులు

వ్యూహాత్మకంగా సిట్ అధికారులు


డ్రగ్స్ కేసులో సిట్ బృందం చాకచక్యంగా వ్యవహరిస్తోంది. డ్రగ్ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను చూపుతూ విచారణకు హజరైనవారి నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సినిమా ఫక్కీలోనే విచారణకు హజరైన ప్రముఖులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో వారు సహకరించకపోతే తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారిస్తున్నారు.మూడోరోజున సుబ్బరాజు నుండి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టారని సమాచారం. ప్రస్తుతం బయటకు వచ్చిన పేర్లకు తోడుగా మరో పది నుండి 15 పేర్లను సుబ్బరాజు బయటపెట్టినట్టు సమాచారం. కొత్తగా బయటకు వచ్చిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.

సినిమా చూపుతున్నారు

సినిమా చూపుతున్నారు


సినీ ప్రముఖులకు సిట్ అధికారులు సినిమాను చూపుతున్నారు. కెల్విన్‌తో పాటు ఈ కేసులో అరెస్టైన నిందితుల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. శుక్రవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు సుబ్బరాజు సిట్ కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆయన విచారణ ముగిసిందని భావించారు. కానీ, ఆయన నుండి కీలక సమాచారం వస్తోన్న నేపథ్యంలో సుబ్బరాజు నుండి మరిన్ని గంటలపాటు విచారణ చేయాలని నిర్ణయించినట్టుగా సిట్ అధికారులు భావించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. బ్యాంకు ఖాతాల సమాచారం, ఫోటోలతో సుబ్బరాజును ప్రశ్నించారు. సుబ్బరాజు నుండి బ్లడ్ శాంపిల్స్ కూడ సేకరించారని సమాచారం.

పబ్‌ల సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు

పబ్‌ల సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు


హైద్రాబాద్ నగరంలోని పబ్‌లు, క్లబ్‌లలో డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయనే సమాచారం సిట్ అధికారులు గుర్తించారు.ఈ సమాచారాన్ని విచారణలో భాగంగా సుబ్బరాజు నుండి సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ మేరకు నగరంలోని అన్ని పబ్‌లు, క్లబ్‌ల యజమానులను విచారించనున్నారు. అయితే 16 పబ్‌లు, క్లబ్‌లలో డ్రగ్స్ విక్రయాలు సాగుతాయనే పక్కా సమాచారాన్ని సేకరించారు. వీటిపై నిఘా కొనసాగుతోంది.

 పూరీ జగన్నాథ్‌కు ఉస్మానియా వైద్యుల పరీక్షలు

పూరీ జగన్నాథ్‌కు ఉస్మానియా వైద్యుల పరీక్షలు


డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్‌కు ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మహ్మద్ రఫీ బుదవారం రాత్రి పలు పరీక్షలు నిర్వహించారు. అతని వెంట్రుకలు, చేతి గోళ్ళను సేకరించారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు డ్యూటీలో ఉన్న ఆర్ఎంఓతో పాటు హౌజ్ సర్జన్ డాక్టర్ గిరిధర్‌ను ఎక్సైజ్ కార్యాలయానికి రప్పించారు. జగన్నాథ్‌కు బీపీ, జీఆర్‌వీఎస్, పల్స్ రేట్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెంట్రుకలు, చేతి గోళ్ళను సేకరించారు. చాలా కాలం క్రితం పూరీ డ్రగ్స్ వాడినట్టు డాక్టర్ రఫీ మీడియాకు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆయన డ్రగ్స్ వాడారా లేదా అనేది తేలనుంది.

English summary
Tollywood actor Subbaraju revealed key information about drugs in SIT interrogation.He attended for enquiry in drugs case on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X