వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేనా హీరోయిజం: టాలీవుడ్ హీరోలు వీటిని చెల్లించ‌లేరా..?

|
Google Oneindia TeluguNews

సినిమాల్లో భారీ డైలాగులు..రాజ‌కీయల్లోకి వ‌చ్చి నీతులు చెప్పే సినీ ప్ర‌ముఖులు నిజ జీవితంలో మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. సొసైటీలో త‌మ‌కున్న బాధ్య‌త‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. తాము సాధార‌ణ పౌరుల‌మే..వారిలాగేనే తాము అన్ని నిబంధ‌న‌లను పాటించాల‌నే విష‌యాన్ని ఉద్దేశ‌పూర్వంగానే విస్మ‌రిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి వ‌చ్చిన ఒక విష‌యం మ‌న హీరోల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌..జ‌రిమానాల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించారో బ‌య‌ట‌కు వ‌చ్చింది...

నిజ జీవితంలో మ‌న సినిమా హీరోలు వారు చెప్పే మాట‌ల‌కు - చేత‌ల‌కు చాలా తేడా ఉంటుంద‌ని నిరూపిస్తున్నారు. హైద‌రాబాద్ లో నివ‌సించే మ‌న తెలుగు హీరోలు ట్రాఫిక్‌ రూల్స్‌ను ఉల్లంఘించి వారు చెల్లించాల్సిన చలాన్లు గత రెండు మూడేళ్లుగా మరుగునపడుతున్నా.. వాటిని మాత్రం చెల్లించటం లేదు. క‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో ఉండి కాదు.. ఆ చిన్న చ‌లాన్ల మీద ఉన్న నిర్ల‌క్ష్యం తోనే అని భావిస్తున్నారు. ఈ కోవ‌లో నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లాంటి స్టార్‌ హీరోలు ఉన్నారు. వారు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్‌, పార్కింగ్‌ నిబంధన లు ఉల్లఘించి ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి.

Tollywood stars Penalty pending : Police special drive..!

ఎందుకీ ఉదాసీన‌త‌..!

ఇలా..చెలానాలు బ‌కాయిలు ఉన్న వారిలో అత్యధికంగా మహేష్‌ బాబు పేరిట ఏడు సార్లు నిబంధనలు ఉల్లంఘించి నందుకు గాను రూ.8,745 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్‌ కట్టటం లేదు. ఇక‌, ఇదే ర‌కంగా 2018లో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు రాజేంద్రనగర్‌ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1035 ఫైన్‌ వేశారు. పవన్‌ కళ్యాణ్‌ వాహనం పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ను చెల్లించలేకపోతున్నారు. సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెం డింగ్‌లో ఉన్నాయి. వీరిలో ఎవ‌రూ కూడా ఇప్ప‌టి దాకా జ‌రిమానాలు చెల్లించ లేన‌ది ట్రాఫిక్ అధికారులు చెబుతున్నా రు. ఇదే ర‌కంగా పది చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్‌ చేస్తామంటూ హైదరాబాద్‌ ట్రాఫిక్ ఉన్న‌తాధికారులు ప్ర‌క‌టించారు.

English summary
Cine Heros pending Traffic challans in Hyderabad. Three famous hero's not clearing this Challans. Now Traffic polilce seriously concentrated on collection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X