వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ లో టామ్ అండ్ జెర్రీ: మంత్రి సత్యవతి రాథోడ్ వస్తే ఎమ్మెల్యే రెడ్యా పరార్

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీలో టామ్ అండ్ జెర్రీ షో నడుస్తోందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే సీనియర్ నాయకుడైన రెడ్యానాయక్ కు, తాజా మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే వచ్చిన ప్రోగ్రాంలో మంత్రి కనబడకపోవడం, మంత్రి ఉన్న ప్రోగ్రాంకి ఎమ్మెల్యే రాకపోవడం , ఒకవేళ వచ్చినా, మంత్రి వచ్చేలోపే అక్కడి నుంచి వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది.

టామ్ అండ్ జేర్రీలా .. రెడ్యానాయక్ వర్సెస్ సత్యవతి రాథోడ్

టామ్ అండ్ జేర్రీలా .. రెడ్యానాయక్ వర్సెస్ సత్యవతి రాథోడ్

డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ సత్యవతి రాథోడ్ టామ్ అండ్ జెర్రీలా తయారయ్యారని చర్చ నడుస్తుంది. అసలు విషయం ఏంటి అంటే డోర్నకల్ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గతంలో మంత్రిగా పనిచేసి సీనియర్ లీడర్ గా ఉన్నారు రెడ్యానాయక్. ఇక గతంలో రెడ్యానాయక్ తో తలపడి,హోరాహోరీగా పోరాడి ఓటమిపాలై, ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఒక మంత్రిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు సత్యవతి రాథోడ్.

జూనియర్ మంత్రిని గౌరవించలేకపోతున్న సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

జూనియర్ మంత్రిని గౌరవించలేకపోతున్న సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా జిల్లాలో కీలక నేతగా సత్యవతి రాథోడ్ వ్యవహరించడం, స్థానికంగా రెడ్యానాయక్ కు ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థి అయిన సత్యవతి రాథోడ్ ను ఇప్పుడు మంత్రిగా గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బాగా ఇబ్బంది పడుతున్న రెడ్యానాయక్ రాజకీయాల్లో తన కంటే జూనియర్, తన చేతిలో ఓటమి పాలైన నేతకు మంత్రి పదవి ఇవ్వడం తో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.

సత్యవతి వస్తుందంటే అక్కడ నుండి వెళ్ళిపోతున్న రెడ్యా

సత్యవతి వస్తుందంటే అక్కడ నుండి వెళ్ళిపోతున్న రెడ్యా

ఇక ఆమె ఎక్కడికైనా కార్యక్రమాలకు వస్తే, ఆ కార్యక్రమాలకు ఆయన హాజరు కావడం మానేశారు. ఒకవేళ హాజరైనా ఆమె రాక ముందు గానీ,వచ్చి వెళ్లిన తర్వాత గాని రెడ్యానాయక్ వస్తుండడం పరిపాటిగా మారింది. ఇక ఈ పరిస్థితి డోర్నకల్ నియోజకవర్గం లోని పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా తయారైంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఇద్దరూ ఒకే నియోజక వర్గానికి చెందిన నేతలు, అందులోనూ ఒకటే పార్టీలో ఉన్న నేతలు కావడంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు, వీరిద్దరి మధ్య అడ్డు వస్తున్న ఇగోలు పార్టీ నేతలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి.

 ఎక్కడ కలిసినా మాటల్లేవ్ .. మాట్లాడుకోవటాలు లేవ్ అంటున్న నేతలు

ఎక్కడ కలిసినా మాటల్లేవ్ .. మాట్లాడుకోవటాలు లేవ్ అంటున్న నేతలు

ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూతురు మహబూబాబాద్ ఎంపీ కవిత కూడా మహిళా మంత్రితో సఖ్యంగా ఉన్న పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు స్థానికంగా ఎమ్మెల్యే, మంత్రి మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో అర్థమయ్యేలా చెబుతున్నాయి.ఇటీవల కందికొండ జాతర జరిగినప్పుడు కందికొండ లక్ష్మీనరసింహ స్వామి వారి జాతరకు మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆంగోతు బిందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇక అప్పటికే దర్శనం పూర్తిచేసుకున్న రెడ్యానాయక్, ఆయన కుమార్తె ఎంపీ కవిత మంత్రికి ఎదురుపడిన అక్కడినుంచి పలకరించకుండా వెళ్లిపోయారు.

ఇక ప్రెస్ మీట్లు కూడా ఒకే చోట వేరు వేరుగా పెడుతున్న నేతలు

ఇక ప్రెస్ మీట్లు కూడా ఒకే చోట వేరు వేరుగా పెడుతున్న నేతలు


కనీసం ఒకరినొకరు ముఖస్తుతికి అయినా పలకరించుకోరు. దీంతో స్థానికంగాఉన్న వారందరికీ వారి తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఆ తర్వాత పలు సందర్భాల్లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడితే ఆ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు డుమ్మా కొట్టారు. ఇక ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తిరిగి అక్కడే మీడియా సమావేశం నిర్వహించడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

 టామ్ అండ్ జెర్రీలా ఇద్దరి మధ్య సైలెంట్ వార్ .. జిల్లాలో జోరుగా చర్చ

టామ్ అండ్ జెర్రీలా ఇద్దరి మధ్య సైలెంట్ వార్ .. జిల్లాలో జోరుగా చర్చ

ఇక సత్యవతి వస్తుంది అంటే రెడ్యా రాక పోవడం, రెడ్యా ఉన్నారు అంటే సత్యవతి ఇబ్బంది పడడం డోర్నకల్ నియోజక వర్గంలో కామన్ గా మారిపోయింది. దీంతో నేతల తీరు టామ్ అండ్ జెర్రీ చూసినట్టుగా ఉందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇక వీరి మధ్యలో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎవరికి ఏమీ చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి సత్యవతి రాథోడ్ రెడ్యానాయక్ ల విషయంలో సీఎం కేసీఆర్ చేసిన పని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీరిపై చర్చకు కారణమవుతుంది.

English summary
Redya nayak is a former senior minister in the joint Warangal district. Redya Nayak of Dornakal constituency is a well-known MLA. A senior leader who had won the six-term MLA and worked as former minister, but KCR was given the opportunity of junior Satyavati Rathod as minister. this made redya nayak un happy .they are fighting silentkly like tom and jerry . they are not talking each other and also not attending any program together .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X