వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు హైదరాబాద్‌కు జగన్ .. ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ రానున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారు. తమ అధినేత ఫస్ట్ టైం భాగ్యనగరానికి రానుండటంతో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఫస్ట్ టైం ...
జగన్ అనే నేను అని గురువారం విజయవాడలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీలో పరిపాలనపై పట్టు సాధిస్తూనే తెలంగాణ పర్యటటిస్తున్నారు. ఏపీలో అఖండ విజయం సాధించి .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ తొలిసారి హైదరాబాద్ వసున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

tomorrow jagan come to hyderabad

ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. భారీ ఫ్లెక్సీలు నగరంలో వెలిశాయి. కార్యకర్తలు, అభిమానులు, జగన్, వైఎస్ఆర్ అభిమానులు శంషాబాద్ నుంచి ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎంగా తొలిసారి అధికారికంగా పర్యటించనుండటంతో .. తమ నేతకు మరచిపోని వెల్ కం ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలు సంసిద్ధంగా ఉన్నారు.

ఇఫ్తార్ విందు
ఈ నెల 5న ముస్లింల పవిత్ర పండుగ రంజాన్. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో శనివారం ఇప్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. దాంతో జగన్ హైదరాబాద్ వస్తున్నారు. గవర్నర్ ఇఫ్తార్ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు. ఇటు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కలువడంతో ఇప్తార్ విందుకే కళరానుంది. గతంలో చంద్రబాబు, కేసీఆర్ కలిసిన పెద్దగా ప్రాధాన్యం లేదు. వారు మధ్య మాటలు లేకపోవడంతో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు.

tomorrow jagan come to hyderabad

ఇటు ఇరురాష్ట్రాల మంత్రులు కూడా హాజరైన దాఖలాలు తక్కువే. ఈ క్రమంలో జగన్, కేసీఆర్ కలయికతో గవర్నర్ ఇఫ్తార్ విందుకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతోపాటు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ప్రసంగించిన కేసీఆర్ .. ఏపీ తమ పొరుగు రాష్ట్రానికి సఖ్యతతో మెలుగుదామని చెప్పిన సంగతి తెలిసిందే. నీటి వాటా సహా తదితరాల కోసం అన్నదమ్ముల్లా పంచుకుందామని .. కలిసి పోరాడి, కేంద్రం నుంచి నిధులు తీసుకొందామని సెలవిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో జగన్, కేసీఆర్ సామరస్యంగా తమ నిధుల కోసం కేంద్రంపై ఉద్యమించే అవకాశం కనిపిస్తోంది.

English summary
AP CM YS Jagan Mohan Reddy will come to Hyderabad on Saturday. After the swearing-in ceremony, Jagan is coming to Hyderabad for the first time. leader of the first time come to hyderabad, ready to make a great welcome
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X