వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు మరోసారి ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ .. ప్రగతిభవన్ నుంచి అసెంబ్లీకి బస్సుల్లో ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు ఖాయమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ .. బరిలో ఉండమని స్పష్టంచేయడంతో 5 ఐదుస్థానాల్లో టీఆర్ఎస్, ఎంఐఎం విజయం నల్లేరుమీద నడకే అవనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు చేయొద్దని సోమవారం తెలంగాణ భవన్ లో నిపుణులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ తర్వాత మాక్ పోలింగ్ చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలంతా ఓటు వేశారు.

రేపు మరోసారి మాక్ పోలింగ్ ..
కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేల మాక్ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మాక్ పోలింగ్ లో తడబాడుతారని, అలాగే కచ్చితంగా ఓటువేయాలనే ఉద్దేశంతో రేపు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం 8.30 గంటలకు కల్లా ప్రగతిభవన్ చేరుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టంచేశారు. అక్కడ మరోసారి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత అక్కడినుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీ తీసుకెళతారు. అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

tomorrow once again mock polling conduct to trs mlas

రాష్ట్రంలో అప్పుడే భానుడి భగ భగలు ... ఎండలతో జనం విల విల

17 సీట్లలో పాగా వేద్దాం ..
తెలంగాణ భవన్ లో సోమవారం జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మరో నెలరోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయని, పార్టీ ప్రతినిధులను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉన్నదని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో 16 ఎంపీ టీఆర్ఎస్, 1 ఎంఐఎం సాధిస్తే .. కేంద్రంలో కీ రోల్ పోషించొచ్చని తెలిపారు. నిధులు, ప్రాజెక్టులకు జాతీయహోదా తదితర ఇబ్బందులు ఉండవన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలంతా అభిప్రాయ బేధాలు వీడి, పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు కేసీఆర్.

English summary
MLAs' mock polling process ended in telangana bhavan. tomorrow again mock polling ocnduct in pragathi bhavan. The MLas have been told to reach Pragati Bhavan by 8.30 am. There is a mock polling there. From there the assembly is taken directly to the buses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X