వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే టాప్ 25 ఐపీఎస్ ల జాబితాలో చోటు ... టాప్ 4 స్థానంలో తెలంగాణా డీజీపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి అరుదైన ఘనత సాధించారు . ఇండియన్ పోలీస్ సర్వీస్ లో పని చేస్తున్న 4000 మంది ఐపీఎస్ అధికారులలో టాప్ 4లో ఆయన నిలిచారు . నేరాలను నియంత్రించే సామర్థ్యం, శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, నిజాయితీపై దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో ఈ ఫలితాలు రావటం విశేషం .

లాక్ డౌన్ అమలుపై పలు ఏరియాల్లో హైదరాబాద్ సీపీ సడన్ విజిట్ .. ఏం చెప్పారంటేలాక్ డౌన్ అమలుపై పలు ఏరియాల్లో హైదరాబాద్ సీపీ సడన్ విజిట్ .. ఏం చెప్పారంటే

ఐపీఎస్ ల పని తీరుపై సర్వే : ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు

ఐపీఎస్ ల పని తీరుపై సర్వే : ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు

ఇక ఐపీఎస్ ల పని తీరుపై సర్వే చేసిన ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు భారతదేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి చోటు కల్పించాయి. ఈ సర్వేలో ఇండియాలోని 4000 మంది ఐపీఎస్‌ అధికారుల జాబితాపై సర్వే నిర్వహించగా ఫైనల్ గా టాప్ 25 జాబితా తయారు చేశారు . తెలంగాణా రాష్ట్ర డీజీపీ టాప్‌ 25లో నాలుగవ స్థానం దక్కించుకున్నారు . టాప్ 25 ఐపీఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైనందుకు డీజీపీ మహేందర్‌రెడ్డిని మంత్రులు, ఐపీఎస్ అధికారులు అభినందించారు .

 4 వేలమంది అధికారుల జాబితాలో టాప్ 4 గా నిలిచిన తెలంగాణా డీజీపీ

4 వేలమంది అధికారుల జాబితాలో టాప్ 4 గా నిలిచిన తెలంగాణా డీజీపీ

దాదాపు 4 వేలమంది అధికారుల జాబితాలో టాప్ 25 ఐపిఎస్ అధికారుల లిస్టు ఫైనల్ చేసింది సర్వే సంస్థ . పోలీసు అధికారుల అంతర్గత నివేదికలు, మీడియా నివేదికలు, నిర్ధిష్ట జిల్లాల్లో సదరు ఐపీఎస్ లకు సంబంధించిన మొదటి పోస్టింగ్ నుండి ప్రస్తుత హోదా వరకు కొలమానంగా నిర్వహించిన సర్వేలో డీజీపీ మహేందర్ రెడ్డి ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణా రాష్ట్రంలో పోలీస్ శాఖకు సంబంధించిన ఎలాంటి టాస్క్ అయినా చాలా సమర్ధంగా నిర్వహించారు అని సర్వే గుర్తించింది.

 సర్వే వివరాలు వెల్లడించిన పీఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా

సర్వే వివరాలు వెల్లడించిన పీఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా

ఇక ఈ సర్వేపై పీఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా మాట్లాడారు. ఆయన తన మాటల్లో ఓ ఐపీఎస్ అధికారి కేవలం శాంతిభద్రతల నిర్వహణ మాత్రమే కాకుండా నక్సలిజం, ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అనేక విచిత్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇక అలాంటి టాస్క్ లన్నీ సమర్ధంగా నిర్వహించిన ఐపీఎస్ లను జల్లెడ పట్టి ఈ లిస్టు తయారు చెయ్యటం విశేషం .

Recommended Video

Lockdown : Central Government Planning To Extend The Lockdown!
 పోలీసుశాఖలో పనితీరులో డీజీపీ బెంచ్ మార్క్

పోలీసుశాఖలో పనితీరులో డీజీపీ బెంచ్ మార్క్

ఈ జాబితాలో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అరవింద్‌కుమార్‌, రా చీఫ్‌ సమత్‌కుమార్‌ గోయల్‌, ఐటీబీపీ డీజీపీ ఎస్‌ఎస్‌ దేశ్వల్‌, సీఆర్పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి, పలు రాష్ట్రాల డీజీపీ లు చోటు సంపాదించారు. పోలీసు సేవలో పనితీరు ద్వారా కొత్త తరానికి బెంచ్ మార్క్ సృష్టించిన టాప్ 25 ఐపిఎస్ అధికారులను పీఎస్‌యూ వాచ్ సంస్థ ఈ సర్వే ద్వారా గుర్తించింది. ఇక తెలంగాణా డీజీపీ విషయానికి వస్తే 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేందర్‌రెడ్డి 2017లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.ప్రస్తుతం దేశంలోనే టాప్ 4 లో నిలిచారు .

English summary
The survey of the top 25 IPS officers on the list of nearly 4 thousand officers has been finalized. DGP Mahender Reddy confirmed the best in a survey conducted on police officials, from internal reports, media reports and the first posting of IPSs in specific districts to the current status. The survey found that the task of the police department in the state of Telangana was very efficient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X