హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో వివాహేతర సంబంధం వివాదం: డిసిపిపై భార్య ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసు శాఖలో వెలుగు చూసిన మరో వివాహేతర సంబంధం కలకలం సృష్టిస్తోంది. నగర సాయుధ బలగాలకు చెందిన డిప్యూటీ పోలీసు కమిషర్ కె. బాబూరావుపై ఆయన భార్య వేదశ్రీ ఫిర్యాదు చేసింది.

తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్ ‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేసింది. వివాహమైనప్పటి నుంచి తన భర్త కారణమేదీ లేకుండా తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది.

మరో మహిళతో వివాహేతర సంబంధం

మరో మహిళతో వివాహేతర సంబంధం

ఇరువురి పెద్దలు కూర్చుని మాట్లాడినా తన భర్త బాబూరావులో మార్పు రాలేదని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వద్దని చెప్తే తనను కొట్టాడని, తనకు నలుగురు పిల్లలు ఉన్నారని వేదశ్రీ ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని డిజిపిని కోరింది.

పెళ్లికి ముందు బంధువే...

పెళ్లికి ముందు బంధువే...

తాను 1983 జూన్ 8వ తేదీన తమకు బంధువైన బాబూరావును పెళ్లి చేసుకున్నానని, ఆ రోజు నుంచే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె అన్నారరు తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళ కూడా తనను బెదిరిస్తోందని ఆమె ఫిర్యాదు చేసింది.

నాకు ముగ్గురు ఆడపిల్లలు

నాకు ముగ్గురు ఆడపిల్లలు


తనతకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ మగ పిల్లాడు ఉన్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె చెబుతూ డిజిపి కార్యాలయంలోనూ హైదరాబాదు పోలీసు కమిషనర్ కార్యాలయంలోనూ బాబూరావు ఫొటోలు పెట్టి వినతిపత్రాన్ని సమర్పించింది.

తన సంతకం ఫోర్జరీ చసి...

తన సంతకం ఫోర్జరీ చసి...

తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కాపురు చేస్తున్న బాబూరావు తనను మోసం చేస్తున్నాడని వేదశ్రీ ఆరోపించింది. తన పేరిట విజయవాడలో స్థల ఉందని, రిజిస్ట్రేషన్ ప్రాల్లో తన ఫొటో బదులు ప్రస్తుతం ఆయనతో ఉంటున్న మహిళ ఫొటోను అతికించి, తన సంతకం ఫోర్జరీ చేసిన తన ఆస్తిని విక్రయించారని వేదశ్రీ ఆరోపించారు.

 విజయవాడలో ఆ స్థలం

విజయవాడలో ఆ స్థలం

విజయవాడలో సర్వే నెంబర్ 58లో 192 చదరపు అడుగుల స్థలం ఉందని, ఫోర్జరీ సంతకాలతో తన భర్త దాన్ని విక్రయించాడని వేదశ్రీ చెప్పారు.తన హక్కులను డిమాండ్ చేస్తుండడంతో భర్తతో పాటు ఆ మహిళ తనను బెదిరిస్తోంది ఆమె ఫిర్యాదు చేశారు.

ఆరోపణలను ఖండిస్తున్న డిసిపి

ఆరోపణలను ఖండిస్తున్న డిసిపి

అయితే, వేదశ్రీ ఆరోపణలను బాబూరావు ఖండిస్తున్నారు. నలుగురు పిల్లలను తన వద్ద వదిలేసి, తానే 1996లో తనను వదిలిపెట్టి వెళ్లిపోయిందని బాబూరావు అంటున్నారు. ఆ ఆంగ్లదినపత్రికతో ఆయన మాట్లాడారు..

English summary
The estranged wife of deputy commissioner of police, CAR (City Armed Reserve), K. Babu Rao, has filed a complaint with the director general of police, Telangana, M. Mahendar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X