హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముసద్దీలాల్ జ్యూయలరీస్ డైరెక్టర్లు అరెస్ట్, 110 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు కోసమేనా?

తప్పుడు డాక్యుమెంట్లతో ముసద్దీలాల్ జ్యూయల్లరీస్ డైరెక్టర్లు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తాలు బ్యాంకుల్లో 110 కోట్లు డిపాజిట్ చేశారని పోలీసులు తెలిపారు. వీరిద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :ముసద్దీలాల్ జ్యూయలరీస్ దుకాణం యజమానికి కైలాష్ చంద్ గుప్తా ఇద్దరు కొడుకులను సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత తప్పుడు డాక్యుమెంట్లతో 110 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి

తెలిపారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ముసద్దీలాల్ జ్యూయలరీస్ దుకాణంపై వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ సాగుతోంది.

top directors of Musaddilal Jewellers held

కైలాస్ చంద్ గుప్తా ఇద్దరు కొడుకులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తాలలు ముసద్దీలాల్ జ్యూయలరీస్ దుకాణంలో డైరెక్టర్లుగా ఉన్నారు.

అయితే పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కుట్ర, మోసం, తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేసి పెద్ద నగదునోట్లను మార్పిడి చేశారని పోలీసులు చెప్పారు.

ఇతరులతో కలిసి సుమారు 110 కోట్ల రూపాయాల నల్ల ధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్టు చేశారని సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి చెప్పారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలతో పాటు, కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని పోలీసులు చెబుతున్నారు. ఈ కుట్రలో ముసద్దీలాల్ జ్యూయల్లరీస్ లో డైరెక్టర్లుగా ఉన్ననితిన్ గుప్తా, నిఖిల్ గుప్తాలు కీలకంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు.

English summary
Central Crime Station police arrested two sons of Musaddilal's owner Kailash Chand Guptha following alleged fraudland transactions following the demonetisation of high-value notes. Nithin Guptha and Nikhil Guptha, directors of Musaddilal Jewellers and other firms, have been accused of conspiracy, cheating, falsification of accounts, forgery and concealing evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X