వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం తీసుకొమ్మని మంత్రిగారే చెప్పారు: దుమారం రేపుతున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ వ్యాఖ్యలు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల: లంచం తీసుకొమ్మని స్వయంగా మంత్రిగారే తనకు చెప్పారంటూ అధికార పార్టీకి చెందిన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎస్.పావని చేసి వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ తీసుకుని దాన్ని కౌన్సెలర్లకు పంచాలని సదరు మంత్రి అన్నట్టు ఆమె ఆరోపిస్తున్నారు. సిరిసిల్ల అభివృద్ధికి సంబంధించి రూ.116.28 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ఆరోపణలు చేశారు.

‘‘ఆ మంత్రి కేటీఆరే.. డౌట్ లేదు...’’

‘‘ఆ మంత్రి కేటీఆరే.. డౌట్ లేదు...’’

అయితే తనను కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకొమ్మని ఆదేశించిన ఆ మంత్రి ఎవరన్నది ఛైర్‌పర్సన్ పావని వెల్లడించకపోయినా ఈ వ్యాఖ్యలు తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఉద్దేశించి చేసినవేనని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలపైగాని, ఇటు విపక్షాల సంధిస్తున్న విమర్శనాస్త్రాలపైగాని ప్రభుత్వం గానీ, టీఆర్‌ఎస్‌ పార్టీగానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

వైరల్‌గా మారిన ఛైర్‌పర్సన్ వ్యాఖ్యలు...

వైరల్‌గా మారిన ఛైర్‌పర్సన్ వ్యాఖ్యలు...

‘కాంట్రాక్టర్ల నుంచి తీసుకునే కమీషన్ 1 నుంచి 3 శాతం ఉంటుంది.. దాన్ని మిగతా కౌన్సెలర్లకు పంపిణీ చేయాలి. ఎందుకంటే వారికి అవసరాలు (ఎన్నికల సమయంలో) చాలా ఉంటాయి.. ఒకవేళ ఈ కమీషన్ తీసుకోకపోతే డబ్బు ఎక్కడ్నించి వస్తుంది? ఒక్క సిరిసిల్లలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఇలాగే ఉంది. కమీషన్ ముట్టజెప్పకపోతే పనులు జరగవు..' అని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని మీడియాతో అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విపక్షాల చేతికి కొత్త అస్త్రం...

విపక్షాల చేతికి కొత్త అస్త్రం...


బహిరంగంగా ఆమె ఇలా వ్యాఖ్యానించి విపక్షాల చేతికి కొత్త అస్త్రం ఇచ్చినట్టుయ్యింది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం గానీ, టీఆర్‌ఎస్‌గానీ స్పందించలేదు. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సనే ఇలా అవినీతి గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారంటే, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

అందుకే ఈ లంచావతారం...

అందుకే ఈ లంచావతారం...

అవినీతిపై సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని చేసిన వ్యాఖ్యలను విపక్షాల నేతలు తెలివిగా అందిపుచ్చుకున్నారు. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌ను సీఎం‌ పోస్టులో కూర్చోబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి భారీగా డబ్బు కావాలి కాబట్టే.. అందులో భాగంగా కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

వ్యాఖ్యల అనంతరం రాజీనామా...

వ్యాఖ్యల అనంతరం రాజీనామా...

మరోవైపు మంత్రిపై వ్యాఖ్యలు చేసిన వెంటనే వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఛైర్‌పర్సన్ పావని ప్రకటించారు. తనకు ఇంతకాలం సహకరించిన మంత్రి కేటీఆర్‌కు, సహచర మునిసిపల్ కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె రాజీనామా వెనుక అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

English summary
In an unusual turn of events, a Municipal Chairperson from Telangana's Sircilla exposed the underlying corruption in the system. S Pavani made a shocking confession on a camera saying that she was asked by a minister to accept a bribe offer. Pavani alleged that a minister asked her to accept commission from contractors and distribute the same among corporators. Although Pavani refrained from naming the minister, Chief Minister KC Rao's son KT Rama Rao is the Municipal and Urban Minister from Sircilla.Pavani made the allegation while addressing the media after the approval of the municipal budget of Rs 116.28 crore for the development of Sircilla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X