• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎంసెట్ లీక్‌లో కాలేజీల పాత్ర: 130 మందికి లీక్.. సీఐడీ నివేదిక

|

హైదరాబాద్: ఎంసెట్ 2 లీక్ నేపథ్యంలో ఎంసెట్ 3 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మళ్లీ పరీక్షలు వద్దని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఎంసెట్ రద్దు చేస్తే పర్యవసనాల పైన ప్రభుత్వం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఎంసెట్ షాకింగ్: కింగ్ పిన్ ఖలీల్, సీఐడీ తెలివికి విద్యార్థులు ఖంగు

ఎంసెట్ లీకేజ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి, విష్ణు, తిరుమల్.. కింగ్ పింగ్ ఖలీల్ పేర్లు ఇలా ఒక్కరొక్కరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారు వ్యూహాత్మకంగా కథ నడిపారు.

సాధారణంగా బిహార్‌లో ఇలానే ప్రశ్నపత్రాలు బహిర్గతం అవుతుంటాయని, ఇందులోనూ బిహార్‌ ముఠాల ప్రమేయం ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం మాత్రం ఢిల్లీ కేంద్రంగానే బహిర్గతం అయిందని, ఖలీల్‌ పట్టుబడితే తప్ప అసలు విషయం తెలియదని భావిస్తున్నారు.

ఎంసెట్ లీకేజీలో కాలేజీ యాజమాన్యం

ఎంసెట్ లీకేజీలో కొన్ని కాలేజీల యాజమాన్యం పాత్ర ఉన్నట్లుగా సీఐడీ గుర్తించింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మూడు కార్పోరేట్ కళాశాలల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. యాజమాన్యాన్ని ప్రశ్నించింది.

కాలేజీ యాజమాన్యం స్వయంగా నిందితుడు రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లుగా సీఐడీ గుర్తించిందని తెలుస్తోంది. దీంతో కాలేజీల యాజమాన్యం కూడా కీలక సూత్రదారులుగా భావిస్తున్నారు.

ర్యాంకుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో యాజమాన్యం డబ్బులు ఇప్పించిందని తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం, తల్లిదండ్రులను నిందితులుగా చేర్చనున్నారు. ఈ రోజు మరో ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశముంది. కాగా వందమందికి పైగా విద్యార్థులను సీఐడి గుర్తించిందని తెలుస్తోంది.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్ 2ను రద్దు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ యోచనపై విద్యార్థులు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు. కొందరు అక్రమార్కులు చేసిన పాపానికి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టొద్దనీ, ఎంసెట్ 2 రద్దు యోచనను మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.

ఎంసెట్

ఎంసెట్

లీకేజీతో సంబంధం ఉన్న వారి ర్యాంకులను రద్దు చేసి కఠినంగా శిక్షించాలనీ, ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఎంసెట్

ఎంసెట్

ఈ పరిణామాల నేపథ్యంలో ఎంసెట్ 2 రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్ 2 లీకేజీపై సీఐడీ నిర్ధారించినట్లు సమాచారమందిందని, పరీక్ష రద్దుపై ప్రభుత్వం యోచిస్తోందని మీడియాలో వచ్చిన కథనాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

ఎంసెట్

ఎంసెట్

గురువారం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రతిభావంతులైన విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్ 2ను రద్దు చేయొద్దంటూ హైదరాబాద్‌ నుంచే కాకుండా మహబూబ్‌నగర్‌, వరంగల్‌, తదితర జిల్లాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున సచివాలయానికి తరలివచ్చారు.

ఎంసెట్

ఎంసెట్

సచివాలయంలోకి అనుమతించకపోవడంతో ప్రధాన ద్వారం ఎదుట రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. కష్టపడి సాధించుకున్న ర్యాంకు దక్కకుండా పోతోందని విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

ఎంసెట్

ఎంసెట్

ప్రశ్నాపత్రం బహిర్గతమైందని నిర్థారణ అయితే, అక్రమార్కుల ర్యాంకులు మాత్రమే రద్దు చేయడానికి నిబంధనలు అంగీకరించవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంసెట్

ఎంసెట్

నిబంధనల పేరిట ఎంసెట్ 2ను రద్దు చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం చేయొద్దన్నారు. అలాంటి నిబంధనలను మార్చుకోవాలని, అవసరమైతే ఆ చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు.

ఎంసెట్

ఎంసెట్

కాగా, న్యాయం చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం ఎదుట రోజంతా ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులు ఈ సమస్య వైద్య, ఆరోగ్య శాఖకు చెందిందనీ, ఆరోగ్య శాఖ అధికారులేమో ఇది విద్యాశాఖ పరిధిలోనిదని చెబుతూ సమస్యను దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎంసెట్

ఎంసెట్

సచివాలయంలో విద్యా, వైద్య శాఖ మంత్రులిద్దరూ అందుబాటులో లేరన్న సమాచారంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. ఎంసెట్ 2 రద్దు ఆలోచనను మానుకోవాలనీ, తప్పు చేసిన వారి ర్యాంకులను రద్దు చేసి, మిగిలిన వారితో యథావిధిగా ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.

ఎంసెట్

ఎంసెట్

దీనిపై ముఖ్యమంత్రి వద్ద చర్చిస్తామనీ, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని నాయిని చెప్పారు. హోం మంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించలేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు తిరిగి ధర్నా స్థలానికి చేరుకున్నారు.

ప్రభుత్వానికి సీఐడీ నివేదిక

ఏపీ ఎంసెట్ లీకేజ్ వ్యవహారంలో సీఐడీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక అంద చేసింది. 130 మందికి పేపర్ లీకైనట్లు నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఎంసెట్ మళ్లీ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

English summary
At least, 30 MBBS aspirants were privy to the Engineering, Agriculture and Medical Common Entrance Test (Eamcet)-II question paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X