హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ మత్తులో వీరే.. పేర్లు బయటపెట్టిన టీవీ ఛానల్స్, కాపాడేందుకు రంగంలోకి హీరోలు?

డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన వారిని తాము సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని డిఐజి అకున్ సబర్వాల్ గురువారం చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన వారిని తాము సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శుక్రవారం చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

డ్రగ్స్ కేసులో లింకులు ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు జాబితాలో ఉన్నారని తెలిపారు.

ప్రముఖ హీరో, ముగ్గురు హీరోయిన్లకు, దుమ్మురేపిన ఐటం డ్యాన్సర్‌కు నోటీసులు, ఎవరంటే..!?ప్రముఖ హీరో, ముగ్గురు హీరోయిన్లకు, దుమ్మురేపిన ఐటం డ్యాన్సర్‌కు నోటీసులు, ఎవరంటే..!?

హీరోయిన్లను సిట్ ఆఫీసులో కాకుండా బయట విచారిస్తామని వెల్లడించారు. మిగతా వారిని మాత్రం కార్యాలయంలో విచారిస్తామన్నారు. ఇప్పటికి పదిమంది నోటీసులు తీసుకొని సంతకాలు చేశారని తెలిపారు.

కొంతమంది అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేకపోయామని, వారికి కూడా మళ్లీ ఇస్తామని చెప్పారు. విచారణకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

నోటీసులు వీరికే..

నవదీప్, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, శ్యామ్ కే నాయుడు, శ్రీనివాస రావు, తరుణ్, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నందు తదితరులకు పోలీసులు నోటీసులు అందించినట్లుగా తమకు సమాచారం అందిందని టీవీ ఛానల్స్ పేర్లు వెల్లడిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్‌కు కెల్విన్ సరఫరా చేసినట్లుగా తెలుస్తోందని పేర్కొంటున్నాయి. వీరందరికీ గచ్చిబౌలిలోని ఓ పబ్ అడ్డా అని తెలుస్తోంది. ఆ పబ్‌లో నవదీప్‌కు అనధికార వాటా ఉందని కూడా సమాచారం. మరోవైపు, కేసు నుంచి నవదీప్‌ను తప్పించేందుకు అయిదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోందని పేర్కొంది.

కాగా, తనకు కనీసం సిగరేట్ కూడా అలవాటు లేదని, తనపై వచ్చిన ఆరోపణలతో తన కుటుంబం బాధపడుతోందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త నందు మాదక ద్రవ్యాలు వాడుతున్నాడంటే తాను నమ్మనని గాయని గీతా మాధురి అన్నారు. మీడియాలో వార్తలు చూసి అవాక్కయ్యానని తెలిపారు. నందుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటే ఉంటే తనకు తప్పకుండా తెలిసేదన్నారు. పోలీసులు విచారణకు రమ్మని అడిగితే తానే స్వయంగా పంపిస్తానని చెప్పారు. నందుకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు లేవని, చెడు అలవాట్లు లేవని అతని స్నేహితులు అన్నారు.

Recommended Video

Bigg Boss Telugu : Sreemukhi And Mumaith To Participate In Jr NTR Bigg Boss Show
టాలీవుడ్ నుంచి 40 మంది వరకు

టాలీవుడ్ నుంచి 40 మంది వరకు

ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో మొత్తం 40 మంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి.

ఎక్కువసార్లు కొనుగోలు చేసిన వారికి నోటీసులు

ఎక్కువసార్లు కొనుగోలు చేసిన వారికి నోటీసులు

వారి ఫోన్ల నుంచి సినీ ప్రముఖులకు, సినీ ప్రముఖుల నుంచి వారికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. వాట్స్ యాప్ గ్రూపుల మాధ్యమంగా డ్రగ్స్ కావాలని ఆర్డర్లు వెళ్లాయి. వాటన్నింటినీ సేకరించిన పోలీసులు, ప్రస్తుతానికి ఎక్కువసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారని భావించిన వారికి మాత్రమే నోటీసులు పంపారు.

పక్కా సాక్ష్యాలతోనే..

పక్కా సాక్ష్యాలతోనే..

ఇక, వీరి విచారణ ముగిసిన అనంతరం మరో 25 నుంచి 30 మందికి నోటీసులు ఇచ్చి, వారందరినీ ప్రశ్నించాలని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. పక్కాగా సాక్ష్యాలు లేకుండా తాము ఎవరినీ పిలువదల్చుకోలేదని, సాక్ష్యం ఉందని భావించిన తర్వాతే నోటీసులు పంపామని అకున్ సబర్వాల్ వెల్లడించారు.

కీలక వ్యక్తి అరెస్ట్

కీలక వ్యక్తి అరెస్ట్

మరోవైపు, డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో పోలీసులు ఈ రోజు కీలక వ్యక్తిని అరెస్టు చేశారని తెలుస్తోంది. అతనిని శుక్రవారం (ఈ రోజు) మీడియా ఎదుట ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది.

English summary
The Special Investigation Team (SIT) of the enforcement wing of the excise and prohibition department, on Wednesday, sent notices to 10 prominent Tollywood personalities to appear before it for questioning in the drugs case. Another 35 personalities will get notices in the coming two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X