హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ ఎన్నికల్లో 'క్రిమినల్' అభ్యర్థులు ఎంతమందో తెలుసా... ఏ పార్టీ తరుపున ఎంతమంది...

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మందికి నేర చరిత్ర ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(FGG) వెల్లడించింది. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున 13 మంది,బీజేపీ తరుపున 17,కాంగ్రెస్ అభ్యర్థులు 12 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. మల్కాజ్‌గిరి డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 72 మందికి నేర చరిత్ర ఉన్నట్లు తెలిపింది. ఈసారి ఎన్నికల్లో నేరచరిత్ర లేని అభ్యర్థులకే ఓటేయాలని సుపరిపాలన వేదిక ప్రజలకు పిలుపునిచ్చింది.

గ్రేటర్‌ ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవద్దని ఇటీవల ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) కార్యదర్శి పద్మనాభరెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్‌ చేశారు. క్రిమినల్‌ కేసులు, ఇతరత్రా వివాదాల్లో నిందితులుగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో యువత ఓటు వేసేందుకు ఆసక్తి చూపట్లేదన్నారు. 2016 ఎన్నికల్లో 72 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు పోటీ చేయగా అందులో 30శాతం మంది గెలిచారన్నారు.

total 49 candidates with criminal background contesting in ghmc elections

ఇక గ్రేటర్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో చైతన్యం తీసుకురావడంలో పౌర సంఘాలు కీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యాలయంలో పలు పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 25 నాటికి పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి,సీనియర్ సిటిజెన్స్ సమాఖ్య ప్రతినిధి రావ్ చెలికాని తదితరులు పాల్గొన్నారు.

కాగా,డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న కౌంటింగ్,అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తితే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 150డివిజన్లలో,బీజేపీ 149 డివిజన్లలో, 146 డివిజన్లలో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

English summary
Over 49 candidates with criminal antecedents contesting in GHMC elections said Forum for good governance secretary Padmanabha Reddy on Wednesday. Total 1,122 candidates are contesting in GHMC this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X