• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ‌ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్ ఫిర్యాదు.. హక్కులను కాపాడాలని విజ్ఞ‌ప్తి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పోలీసులు తీరుపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు టీసీపీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను కలిసి వారికి భరోసా కల్పించేందుకు కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి లిఖిత పూర్వక సమాచారం లేకుండా తన ఇంటిని భారీగా పోలీసులు మోహరించారన్నారు. అనుమతి లేకుండా అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారంలో రెండు సార్లు రాజ్యంగం త‌న‌కు కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాల‌ని స్పీక‌ర్‌ను కోరారు.

అడుగ‌డుగునా పోలీసుల నిర్బంధం.

అడుగ‌డుగునా పోలీసుల నిర్బంధం.

గత వారం రోజులుగా తనును రెండు స్లారు క్షేత్ర‌స్థాయి పర్యటనల‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దమనీయంగా మారిందన్నారు. సమస్యలతో ఉన్న ఆ రైతాంగాన్ని కలిసి చర్చించి భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లానని నిర్ణయించాము. కానీ తనను వెళ్లనీయకుండా పదే పదే అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో స్పీకర్‌కు రేవంత్ వివరించారు. అర్థరాత్రి పోలీసులు వచ్చి తన ఇంటిని చుట్టుముట్టార‌ని పేర్కొన్నారు. ఎలాంటి మౌళికమైన, లిఖిత పూర్వకమైన సమాచారం లేకుండా తనను గృహనిర్బంధం చేశారని తెలిపారు. ఈ వారంలో ఇలా రెండో సారిరని లోక్‌స‌భ‌ స్వీకర్ వివ‌రించారు. తనకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ‌ను, హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని త‌న హ‌క్కులను కాపాడాల‌ని స్పీకర్‌ని కోరారు.

Go. 317 రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం..


అంతకు ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, ఉద్యోగుల, నిరుద్యోగులు ఎవరు సంతోషంగా లేరన్నారు. రాష్ట్రాన్ని అతలా కుతలం చేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలన్నాయని మండిపడ్డారు. విద్యార్ధులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను రోడ్డెక్కేలా చేశారన్నారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. Go. 317 రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధమ‌న్నారు. జేత్రాల్ నాయక్ సొంత జిల్లాలో ఉంచాలని కోరాడు కానీ ములుగు జిల్లాకు బదిలీ చేశారన్నారు. ఆ బాధ బరించలేక గుండె పోటుతో మృతి చెందాడు. వాళ్ళను పరామర్శించేందుకు వెళ్లాలని చూస్తే త‌న‌ను నిర్భందం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బాధిత కుటుంబాన్నీ పరామర్శించడం తప్పా..?. ఎందుకు మమ్మల్ని అడ్డుకోవడం అని పోలీసులను ప్రశ్నించారు.

పరామర్శించడం పాపమా!?

పరామర్శించడం పాపమా!?

వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శయంపేటలో (శుక్రవారం ) రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఈక్రమంలో రేవంత్ ఇంటి వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. ర‌చ్చ‌బండ‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయ‌న‌ను గృహ నిర్బందం చేశారు. తెలంగాణలో రైతులు చస్తుంటే... పరామర్శించడం పాపమా!? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్... ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? అని నిలదీశారు. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు... కానీ... పేదరైతు కుటుంబాన్ని మేం పరామర్శిస్తుంటే తప్పా? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నూతన సంవత్సరంలో కార్యాచరణే.. జైల్ భరో ..

నూతన సంవత్సరంలో కార్యాచరణే.. జైల్ భరో ..

తెలంగాణ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాకు తిక్క రేగితే..జైల్ భరో చేస్తాం. అప్పుడు ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామ‌ని హెచ్చరించారు.. నూతన సంవత్సరంలో కార్యాచరణే.. జైల్ భరో చేస్తామ‌న్నారు. సీఎం కేసీఆర్ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చారని.. పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నార‌న్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

English summary
MP Revanth reddy Complains to Loksabha Speaker om birla about Telangana police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X