ఆ సీటు సీతక్కకే ఇచ్చేస్తా -నిఘా వర్గాలు చెప్పంగనే కేసీఆర్ తలుపులు -త్వరలో రాష్ట్ర పర్యటన: రేవంత్ రెడ్డి
''నాకు పీసీసీ పదవి వస్తోందని నిఘా వర్గాలు రిపోర్ట్ చెప్పంగనే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ తలుపులు తెరిచిండు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడతాం'' అని వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమితుడైన రేవంత్ ను కలిసేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం భారీ ర్యాలీగా హైదరాబాద్ తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ములుగు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా జూబ్లీహిల్స్‌లోని రేవంత్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం చేశారు..
petrol:
బీజేపీ
మంత్రి
పిలుపు
-సైకిళ్లు
వాడండయ్యా..
ఆరోగ్యానికి
కూడా
మంచిది..

తెలంగాణ విముక్తే లక్ష్యం
''సుదీర్ఘకాలంపాటు సాగిన ఉద్యమాలు, ప్రజల కష్టాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రం ఇవాళ దొంగలపాలైంది. తెలంగాణను పట్టి పీడిస్తున్న దోపిడీ వర్గాల నుంచి విముక్తి కల్పించడం కోసం పోరాడతా. కేసీఆర్ కబంధ హస్తాల్లో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించడమే నా లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు పీసీసీ పదవి వస్తుందని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే .. ప్రగతి భవన్ తలుపులు తెరచుకున్నాయి.
గుడ్‌న్యూస్:
భారత్‌లో
4వ
వ్యాక్సిన్
-Moderna
టీకా
దిగుమతి
కోసం
Ciplaకు
DCGI
అనుమతి

అందుకే కేసీఆర్‌ను దింపాలె
కాంగ్రెస్ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో వారికి విలువ లేకుండా పోయింది. గ్రామాలకు ఖర్చు చేయాల్సిన నిధులు కూడా రావడంలేదు. తెరాస స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. స్థానిక నేతలు రోడ్డున పడ్డారు. సర్పంచ్, ఎంపీటీసీలమని చెప్పుకోలేకపోతున్నారు. దిక్కులేక స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవంగా బతకాలంటే తెరాస పోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే వారికి గౌరవం దక్కుతుంది. తెలంగాణ అమరులకు, రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలి.

సీతక్క నాతో సరిసమానం
ములుగు ఎమ్మెల్యే సీతక్క నాతో సరిసమానం. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతా. సీతక్క నాకు అండగా ఉంది'' అని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, తనకు పదవులపై ఆశలేదన్న రేవంత్.. రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలలా పర్యటిస్తానని స్పష్టంచేశారు. మంత్రుల అవినీతిని గురించి ఏమీ తెలీనట్లు సీఎం కేసీఆర్ నటిస్తున్నారని, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే లక్షల్లో వసూలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.