వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో ఎల్ఆర్ఎస్ ... నో టీఆర్ఎస్ నినాదం .. భవిష్యత్ లో అధికారం కాంగ్రెస్ దే : పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్

|
Google Oneindia TeluguNews

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజలను పీల్చిపిప్పి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతోంది. ఒక వైపుతెలంగాణా ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ, క్రమబద్ధీకరణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది అంటూ మండిపడుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంట్లో దొంగలు... చోరీకి విఫలయత్నం... టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంట్లో దొంగలు... చోరీకి విఫలయత్నం...

రానున్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అంటూ పిలుపునిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేత, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .

TPCC Chief Uttam Kumar reddy says No LRS ... No TRS slogan

నో ఎల్ఆర్ఎస్ , నో టీఆర్ ఎస్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళతామని పేర్కొన్న ఆయన ప్రజలెవరూ ఇబ్బంది పడి ఎల్ఆర్ఎస్ కట్టొద్దని అన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూర్చడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారు అంటూ నిప్పులు చెరిగారు.

అధిక వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ విధానం వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందన్నారు పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నో ఎల్ ఆర్ఎస్ , నో టీఆర్ఎస్ నినాదంతో ఉద్యమాలు చేస్తామని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరూ భూములపై ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు.

English summary
The Congress party is cracking down on the LRS brought by the Telangana government to regularize illegal layouts. while the people of Telangana are suffering with corona the Telangana government is incensed that it is robbing the people in the name of regularization. Congress leader and PCC chief Uttam Kumar Reddy has called on the Congress party to win the upcoming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X