వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవాల్: 106 సీట్లు రాకపోతే కెసిఆర్ తప్పుకొంటారా, అలా అయితే నేను గుడ్‌బై: ఉత్తమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టిఆర్ఎస్‌‌కు 106 సీట్లు రాకపోతే కెసిఆర్‌ రాజకీయాల నుండి తప్పుకొంటారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు సవాల్ విసిరారు.

గతంలో కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. బస్సు యాత్ర, పాదయాత్రలతో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌కు సవాళ్ళను విసురుతోంది.

కెసిఆర్‌కు ఉత్తమ్ సవాల్

కెసిఆర్‌కు ఉత్తమ్ సవాల్

2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 106 సీట్లు రాకపోతే కెసిఆర్ రాజకీయాల నుండి తప్పుకొంటారా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కూడ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుండి తప్పుకొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై రెండు పార్టీల నేతల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకొన్నాయి.

రాష్ట్రానికి కెసిఆర్ ఏం చేయలేదు

రాష్ట్రానికి కెసిఆర్ ఏం చేయలేదు

రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చేయలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్ళలో రాష్ట్రానికి ఏం చేయలేక గత పాలకులను విమర్శిస్తున్నారని కెసిఆర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కెసిఆర్ ఏం చేశాడో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

రైతులకు రూ.2 లక్షల రుణమాపీ

రైతులకు రూ.2 లక్షల రుణమాపీ

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణాలను రైతులకు మాఫీ చేయనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయాలను మాఫీ చేసింది. రుణమాఫీ సక్రమంగా అమలు కావడం లేదని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. దీంతో తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణాలను మాఫీ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చింది.

కెసిఆర్ ఎన్నికల జిమ్మిక్కు

కెసిఆర్ ఎన్నికల జిమ్మిక్కు

వ్యవసాయానికి పెట్టుబడి కింద ఏటా రూ. 8 వేల రూపాయాలను కేటాయించాలని నిర్ణయించడం ఎన్నికల జిమ్మిక్కుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కెసిఆర్ వ్యవసాయానికి పెట్టుబడి పథకాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు.

English summary
Congress party chief Uttam Kumar Reddy challenged to Telangana Cm KCR.If Congress party will not power in Telangana in 2019 I will be withdrawn from politics, If TRS will not won 106 seats in upcoming elections KCR should retire from politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X