వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి రేణుకా: సెటిలర్ల కోసం కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమై వ్యూహన్ని అనుసరిస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపే సెటిలర్లను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో అధికారంలోకి రాకపోవడం తెలంగాణ ప్రాంత నాయకుల్లో తీవ్ర నిరాశను నింపింది. .తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ విపక్షాలను దెబ్బతీసేందుకు చేస్తోన్న ప్రయత్నాలపై కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.

అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అయితే హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకొనేందుకు అవసరమైన వ్యూహలను రచించాలని పార్టీ నాయకత్వాన్ని కొరుతున్నారు ఆయా జిల్లాల నేతలు.

సెటిలర్లను తమవైపుకు తిప్పుకొంటే ఈ రెండు జిల్లాల్లోని సీట్లలో విజయం సాధ్యమౌతోందనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నేతలున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేణుకా చౌదరిని రంగంలోకి దింపాలని కొందరు నేతలు కోరుతున్నారు.

 రంగంలోకి రేణుకా చౌదరి

రంగంలోకి రేణుకా చౌదరి


రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల్లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనచేస్తోంది. సెటిలర్లను ఆకర్షించకపోతే 2019లో కాంగ్రస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉండవని పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. సెటిలర్లను ఆకర్షించేందుకు ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.

 కాంగ్రెస్ పార్టీక వ్యతిరేకంగా 2014లో ఓటు

కాంగ్రెస్ పార్టీక వ్యతిరేకంగా 2014లో ఓటు

2014లో రాష్ట్ర విభజనను ఏపీ ప్రజలు వ్యతిరేకించారు. రాష్ట్రం కలిసి ఉండాలని ఆందోళన చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోవడం లేదు. వంద ఓట్లు కూడ రాని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో కూడ సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో టిడిపి, బిజెపి అభ్యర్థులు అత్యధికంగా హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండే విజయం సాధించారు.

సెటిలర్లకు భరోసా కల్పించాలి

సెటిలర్లకు భరోసా కల్పించాలి

సెటిలర్లకు తాము అండగా ఉంటామనే భరోసాను కల్పించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగారెడ్డి జిల్లా నేతలు పిసీసీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై భరోసాను సెటిలర్లలో కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు జిల్లాల్లో సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రేణుకా చౌదరి లాంటి నేతలను రంగంలోకి దింపాలని వారు కోరుతున్నారు.

రేణుకా కూడ ఓకే

రేణుకా కూడ ఓకే

హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలోని సెటిలర్లకు తాము అండగా ఉంటామనే భరోసాను కల్పించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ అవసరాల కోసం సహకరించేందుకు తాను సిద్దమేనని రేణుకాచౌదరి కూడ హమీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

English summary
Telangana Congress party focus on Hyderabad, Rangareddy districts, congress party planning to attract in settler voters in Hyderabad, Rangareddy districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X