ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మగౌరవ యాత్రకు'భట్టి' రెఢీ, కాంగ్రెస్‌కు షాకిస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క ఆత్మగౌరవ యాత్రను నిర్వహించనున్నారు. పార్టీ అధిష్టానం అనుమతితోనే ఆయన ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొంతకాలంగా ఆయన పార్టీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క ఆత్మగౌరవ యాత్రను నిర్వహించనున్నారు. పార్టీ అధిష్టానం అనుమతితోనే ఆయన ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న భట్టి విక్రమార్క పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో భట్టివిక్రమార్క చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకొంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గాను పార్టీ నేతలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు నొక్కి చెబుతున్నారు.

అయితే పార్టీ అగ్రనేతల మధ్య సమన్వయం అంతంత మాత్రంగానే ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. పీసీసీ నాయకత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు కూడ లేకపోలేదు. అయితే ఈ తరుణంలోనే తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను మార్చేసింది. ఆయన స్థానంలో కుంతియాకు బాధ్యతలను అప్పగించింది.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం నెలకొందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.. ఈ తరుణంలోనే భట్టి విక్రమార్కపై సోషల్ మీడియాలో పార్టీ వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది..

ఆత్మగౌరవ యాత్ర చేయనున్న భట్టి

ఆత్మగౌరవ యాత్ర చేయనున్న భట్టి

నేరేళ్ళ ఘటనపై కూడ భట్టి అంటీముట్టనట్టుగానే వ్యవహరించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో భట్టి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరుతారని సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాలను ఆయన వర్గీయులు కొట్టిపారేశారు. దీనికి కౌంటర్‌గా భట్టి విక్రమార్క ఆత్మగౌరవ పాదయాత్రను చేయాలని నిర్ణయించినట్టుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన ఈ యాత్రను చేయనున్నారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో భట్టి పాదయాత్రను నిర్వహించనున్నారు.

Recommended Video

Chandrababu Naidu Is Better Than KCR! | Oneindia Telugu
 పార్టీ మారుతారనే ప్రచారం ఎందుకు జరిగింది

పార్టీ మారుతారనే ప్రచారం ఎందుకు జరిగింది

కాంగ్రెస్ పార్టీని భట్టి విక్రమార్క వీడుతారనే ప్రచారం ఎందుకు సాగిందో అర్థం కావడం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అమెరికా పర్యటన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.అయితే దీన్ని అవకాశంగా తీసుకొన్న కొందరు పార్టీ మారుతారనే ప్రచారం చేశారని అంటున్నారు భట్టి సన్నిహితులు. అయితే నిప్పు లేనిదే పొగరాదని అనే వాళ్ళు కూడ లేకపోలేదు. ఏదైతేనేం భట్టి విక్రమార్క ఒకవేళ పార్టీ మారితే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే కొందరు ప్రత్యర్థులు ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ప్రచారాన్ని చేశారా... అధికార పార్టీ నుండి ఒత్తిడి వచ్చిందా అనే విషయమై కూడ చర్చ కూడ లేకపోలేదు.అయితే ఈ తరుణంలోనే ఆత్మగౌరవ యాత్రను నిర్వహించనున్నట్టు భట్టి విక్రమార్క ప్రకటించడం కాంగ్రెస్ వర్గీయులకు కాస్త ఊరట లభించింది.

ప్రజాస్వామ్యవాదులను ఏకం చేసేందుకే యాత్ర

ప్రజాస్వామ్యవాదులను ఏకం చేసేందుకే యాత్ర

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలోనే ప్రజాస్వామ్యవాదులను ఏకం చేసేందుకే ఆత్మగౌరవ యాత్రను నిర్వహిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా పార్టీలో తన సత్తాను నిరూపించేందుకు భట్టి సిద్దమౌతున్నారని సమాచారం.

 టిఆర్ఎస్‌పై ఒంటికాలిపై లేచే భట్టి విక్రమార్క

టిఆర్ఎస్‌పై ఒంటికాలిపై లేచే భట్టి విక్రమార్క

అసెంబ్లీలో కానీ, బయట కానీ, రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెైస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఒంటికాలిపై లేచేవారు. తన వాగ్దాటితో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవారు.అంతేకాదు గతంలో చోటుచేసుకొన్న ఘటనలను కూడ ఆయన ప్రస్తావించేవారు.

English summary
Tpcc working president Mallu bhatti vikramarka will conduct yatra soon.Vikramarka announced this Yatra on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X