వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులు పట్టించుకోలేదు, తగిన బుద్ది చెబుతాం: ఉత్తమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ మున్సిఫల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్యను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకొన్నారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని భావిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు సంబంధించి చోటు చేసుకొన్న పరిణామాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం నాడు హైద్రాబాద్ లో స్పందించారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు అమానుషమని మండిపడ్డారు.

గాల్లోనే పేలిన విమానం, సురక్షితంగా బయటపడ్డా, కెసిఆర్‌కు ప్రజలే బుద్ది చెబుతారు: ఉత్తమ్‌గాల్లోనే పేలిన విమానం, సురక్షితంగా బయటపడ్డా, కెసిఆర్‌కు ప్రజలే బుద్ది చెబుతారు: ఉత్తమ్‌

Tpcc president Uttam kumar Reddy condemned Nalgonda congress leader Srinivas murder

శ్రీనివాస్‌కు ప్రాణహని ఉందని రక్షణ కల్పించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తగిన బుద్ది చెబుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

శ్రీనివాస్‌ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం నల్లగొండకు వెళ్లనున్నారు.

English summary
TPCC president Uttam kumar Reddy condemned Nalgonda Congress leader Boddupalli Srinivas murder. Pcc president phoned to Nalgonda MLA komatireddy Venkat Reddy on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X