హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ ఏజెంట్‌లా సోమేష్‌: ఉత్తమ్, మావోయిస్టుల నుంచి లేఖ రాలేదు: జగదీశ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సనత్‌నగర్‌లో సెటిలర్ల ఓట్ల తొలగింపుపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 4 లక్షలకు పైగా సీమాంధ్ర ఓటర్లను తొలగించారన్నారు. కుట్రపూరితంగా మరొక 25 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. బోగస్ ఓటర్లను తొలగిస్తే అభ్యంతరం లేదని చెప్పిన ఆయన డోర్ లాక్, షిప్ట్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

tpcc president uttam kumar reddy fires ghmc commissioner somesh kumar

తొలగింపు ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగింపు ఓటర్ల జాబితాను బహిరంగపరచాలన్నారు. ఇక నుంచి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని ఎలక్షన్‌ కమిషనర్‌ జైదీ హామీ ఇచ్చారన్నారు.

రైతు ఆత్మహత్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు.

మావోయిస్టుల నుంచి తనకు ఎలాంటి లేఖలు రాలేదని , మావోయిస్టుల డిమాండ్లను తాము అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖలోని ఏఈ పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీలో బ్రోకర్లు, పైరవీలకు ఆస్కారం లేదన్నారు.

అలా ఎవరైనా అంటే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ నెంబర్‌ను ఏర్పాటు చేశామని ఎవరైనా అభ్యర్ధులను ప్రలోభ పెడుతున్నట్టు తెలిస్తే 8332983914 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అర్హతగల అభ్యర్థులందరూ కష్టపడి చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగల కొరత కారంణంగా ట్రాన్స్‌కోలో ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాల్సి వస్తోందని అందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. 2018 నాటికి తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

English summary
tpcc president uttam kumar reddy fires ghmc commissioner somesh kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X