• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీపీసీసీ పీఠం ఎవరికి..? రేవంత్ రెడ్డికి బాద్యతలపై కసరత్తు..!? సోనియా వ్యూహాత్మక అడుగులు..!!

|

హైదరామాద్ : తెలంగాణ రాజకీయాల ముఖచిత్రం మారబోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న నాయకత్వాన్ని సమూలంగా మార్చివేసి పార్టీకి నూతన జవసత్వాలు అందించేందుకు అదిష్టానం పావులు కదుపుతోంది. ముందుగా తెలంగాణలో నేతలందరి మద్య సఖ్యత తీసుకొచ్చి, పీసిసి నేత పట్ల ఏకాభిప్రాయం కలిగించి, ఎవ్వరూ అసంతృప్తికి లోను కాకుండా చేయాలనేది కాంగ్రెస్ అదిష్టానం వ్యూహంగా తెలుస్తోంది. ఏఐసిసి నిర్ణయానికి అందరూ కట్టుబడి, ఎక్కడా వ్యతిరేక గళం వినిపించకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది ఏఐసిసి.

గణేష్ మంటపాల్లో డీజేలు పెడితే కఠిన చర్యలే..! నిబంధనలు జారీ చేసిన సీపీ..!!

టీపిసీసీ ప్రక్షాళన..! వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సోనియా..!!

టీపిసీసీ ప్రక్షాళన..! వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సోనియా..!!

అందులో భాగంగా తెలంగాణలో పాత కొత్త తేడా లేకుండా పార్టీలో ఎవరు చురుగ్గా పనిచేస్తున్నారో, జనాకర్శణ గల నేత ఎవరు అనే అంశంపై దృష్టి పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొని, అంతే సమర్థవంతంగా తిప్పికొట్టగల నేత ఎవరనే అంశంపై కాంగ్రెస్ అదిష్టానం లోతైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గత రెండు సాధారణ ఎన్నికలను తన నేతృత్వంలో నిర్వహించినా ఆశించిన ఫలితాలు తీసుకురావడంలో విఫలం చెందారనే అపోహ పార్టీ వర్గాల్లో షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోవు మున్సిపల్ ఎన్నికల సమయానికి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి క్షేత్ర స్ధాయిలో బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి..! లోతైన కసరత్తు చేస్తున్న ఏఐసిసి..!!

తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి..! లోతైన కసరత్తు చేస్తున్న ఏఐసిసి..!!

గత ముందస్తు ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పని చేసినా కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రాలేదు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ రు అనుకూలంగా ప్రజల మూడ్ మారినా దాన్ని సరిగ్గా ఓట్ల రూపంలో మార్చుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం చెందినట్టు తెలుస్తోంది. చంద్రబాబు తో పొత్తు కూడా కాంగ్రెస్ పార్టీకి అంతగా కలిసి రాలేదనే చర్చ కూడా జరిగింది. దీంతో కనీసం బలమైన విపక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూర్చోలేని పరిస్థితులు తలెత్తాయి. అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రజల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చింది. అందుకు మొన్నటి లోక్ సభ ఎన్నికలే ఉదాహరణ అనే చర్చ కూడా జరుగుతోంది.

ముందు వరసలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు.! వ్యతిరేకిస్తున్న సీనియర్లు..!!

ముందు వరసలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు.! వ్యతిరేకిస్తున్న సీనియర్లు..!!

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు గెలవటం కాంగ్రెస్ కు మరోసారి ఆశలు పెంచిందనే చెప్పాలి. దీంతో పీసీసీ అధ్యక్ష పదవికి తెలంగాణలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని ద్వేషిస్తున్న కోమటిరెడ్డి సోదరులు, ఇప్పటికే రాహుల్ వద్ద పలుమార్లు పంచాయతీ పెట్టారు. అయినా అదిష్ఠానం మాత్రం ఉత్తమ్ వైపు మొగ్గుచూపటంతో కోమటిరెడ్డి బ్రదర్స్ సైలెంట్ అవుతూ వచ్చారు.. అయినా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పేర్లు చాలా వరకూ తెరమీదకు రావటం సీనియర్లను కాస్త కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సీనియర్లు జానారెడ్డి, వీహెచ్ హన్మంతరావు, శశిధర్ రెడ్డి , పొన్నాల వంటి వారు కూడా ముందు వరుసలోనే ఉన్నారు. వీరందరినీ కాదని, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పీసీపీ పీఠంపై కూర్చోబెట్టాలని రాహుల్ భావిస్తున్నట్టుగా ఊహాగానాలు బయటకు వచ్చాయి.

అందరికి ఆమోదయోగ్యమైన నేత..! సోనియా మార్క్ రాజకీయం.. !!

అందరికి ఆమోదయోగ్యమైన నేత..! సోనియా మార్క్ రాజకీయం.. !!

రేవంత్ రెడ్డి సమర్థతను మున్ముందు ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం దీన్ని ఆమోదిస్తున్నట్టు కనిపిస్తున్నా బీసీ వర్గాన్ని రెచ్చగొడుతున్నట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు వీహెచ్ కూడా రేవంత్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నయి. అయితే తాను ఉన్నా.. పార్టీ వీడినా పెద్దగా నష్టమేమీ పార్టీకు ఉండదంటూ పార్టీ శ్రేణులు ఘాటుగానే స్పందించాయి. ఇటువంటి సమయంలో భట్టి విక్రమార్క కూడా రేవంత్ కంటే సమర్థుడను అంటూ పైరవీలతో పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. పైగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ను ఢీకొని నిలబడాలంటే ఎస్సీ వర్గానికే నాయకత్వ బాధ్యతలు ఇప్పించాలంటూ కొత్తరాగం పినిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎవరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీఠం అప్పజెప్పినా వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతై వ్యతిరేకత తీవ్రతను తగ్గించేందుకు అదిష్టానం వేచిచూసే ధోరణ అవలంబిస్తున్నట్టు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The high command has already decided to use Revanth Reddy's efficiancy in the coming elections. However, the Komatireddy brothers seem to approve it, but there are accusations that the BC catogary is provoking. On the other hand, V.Hanumantha Rao also has the chance to express opposition if Sonia Gandhi is entrusted with leadership responsibilities to Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more