వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమీల అమలుపై చర్చకు సిద్దం, కెటిఆర్, కెసిఆరొచ్చినా రెడీ: మల్లు సవాల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ బిజెపికి ఏజంట్‌గా మారారని పీసీసీ తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేద్దామంటూనే బిజెపికి కెసిఆర్‌ ఏజంట్ గా మారారని ఆయన చెప్పారు.కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజల సొమ్మును ఇతర పార్టీలకు కెసిఆర్ పంపిణీ చేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నాడు మల్లు భట్టివిక్రమార్క హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని చెప్పారు..ఒకటి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులన్నీ ఖర్చు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని మండిపడ్డారు.

 TPCC working president Mallu Bhattivikramarka slams on Telangana chief minister KCR

'కేసీఆర్ తన మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చానని చెప్పడం హాస్యాస్పదం. హామీల అమలుపై మేం సిద్ధం. పోలీసులు లేకుండా గ్రామసభలు పెట్టి ప్రజలను అడుగుదాం. కేసీఆర్ నువ్వు వస్తావా.. లేకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పంపినా చర్చకు మేము సిద్ధమని మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి. పాలకులు మంచి జరగాలని కోరుకుంటారు. కానీ కేసీఆర్‌ మాదిరిగా భూకంపాలు రావాలని కోరుకోరు. కేసీఆర్ భూకంప ప్రకటనతోనే ఆయన మనస్తత్వం ఏమిటో అర్థమవుతోందన్నారు..

దేవెగౌడకు వంద కోట్లు!
కేసీఆర్ బీజేపీకి ఏజెంట్‌గా మారాడు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి బి-టీమ్ మాత్రమే. కేసీఆర్‌వి ఊసరవెల్లి రాజకీయాలు. హరీష్ రావు మాటలు దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉన్నాయి. ప్రాణహిత, ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను టీఆర్ఎస్ ఆపింది. రీడిజైన్ పేరుతో వేలకోట్లు అంచనాలు పెంచింది మీరు కాదా? పాత ప్రాజెక్టులకు పేరు మార్చి కొత్త ప్రాజెక్టులని చెప్పి అంచనాలను పెంచి టీఆర్ఎస్ సర్కార్ దోపిడీ చేస్తున్నదని' భట్టి విక్రమార్క ఆరోపించారు.

English summary
TPCC working president Mallu Bhatti Vikramarka made allegations on Telangana chief minister KCR on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X