వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే 7 రోజులు: హైదరాబాదీలకు ఆ కష్టాలు రెట్టింపు.. కారణమిదే!

సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ కష్టాలు అనుభవించే హైదరాబాదీలకు వచ్చే వారం రోజులు ఆ కష్టాలు రెట్టింపవనున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ కష్టాలు అనుభవించే హైదరాబాదీలకు వచ్చే వారం రోజులు ఆ కష్టాలు రెట్టింపవనున్నాయి. నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్, రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ లకు తోడు వరుస పెళ్లిళ్లతో నగర రోడ్ల మీద వాహనాల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు.

వాహనాల రద్దీ పెరగవచ్చు

వాహనాల రద్దీ పెరగవచ్చు

ఇప్పటికే మెట్రో పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్ చుక్కులు చూపిస్తోంది. దీనికి తోడు వరుస పెళ్లిళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలతో గురువారం నుంచి నగరానికి వాహనాల తాకిడి మరింత పెరగనుంది. నగర రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగితే ట్రాఫిక్ తీవ్రత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

వరుస పెళ్లిళ్లు.. రెహమాన్ కాన్సర్ట్:

వరుస పెళ్లిళ్లు.. రెహమాన్ కాన్సర్ట్:

నవంబర్ 23-26 తేదీల్లో నగరంలో చాలా పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వాహనాల సంఖ్య పెరగనుంది. దీనికి తోడు 26వ తేదీ గచ్చిబౌలి మైదానంలో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రదర్శన ఉంది. కాబట్టి ఆ సమయంలో గచ్చిబౌలి వైపు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.

మోడీ.. ఇవాంకాల రాక:

మోడీ.. ఇవాంకాల రాక:

నవంబర్ 28వ తేదీన నగరంలో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే రోజు ఇవాంకా ట్రంప్, భారత ప్రధాని మోడీ నగరానికి వస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వాహనదారులకు కష్టాలు తప్పవు.

మెట్రో ప్రారంభం, గ్లోబల్ సమ్మిట్:

మెట్రో ప్రారంభం, గ్లోబల్ సమ్మిట్:

నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం కోసం మోడీ నగరానికి రానున్నారు. ఇక అదే రోజు సాయంత్రం ప్రారంభమయ్యే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ కోసం ఇవాంకా ట్రంప్ కూడా నగరానికి రానున్నారు. ఇద్దరు ప్రముఖులు ఒకేసారి హైదరాబాద్ విచ్చేస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు.

English summary
Traffic troubles may increase in next seven days in Hyderabad due to Ivanka Trump, Prime Minister Modi, AR Rahaman visiting to city for various purposes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X