వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరం నుంచి 20కి.మీ ట్రాఫిక్‌జాం: కేంద్రమంత్రి, స్పీకర్ పుష్కర స్నానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గోదావరి మహా పుష్కరాలకు వెళ్లే యాత్రికుల వాహనాలతో రహదారులన్నీ రద్దీగా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు పుష్కరస్నానం ఆచరించేందుకు కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు వెళుతున్నారు.

కాళేశ్వరానికి శనివారం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆ సంఖ్య మరింత పెరిగింది. దీంతో కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు 20 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. తీవ్ర ట్రాఫిక్‌కు తోడు వర్షం కురియడంతో యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు.

ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ మరింత ఎక్కువైంది. దీంతో జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. రహదారులపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్ నుంచి ధర్మపురికి వచ్చే భక్తులు సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వారు జగిత్యాల, సారంగపూర్, బీర్పూరు మీదుగా రావాలని కోరారు. ధర్మపురి నుంచి వెళ్లే వాహనాలు రాయపట్నం మీదుగా, ధర్మపురికి వచ్చే వాహనాలు జగిత్యాల మీదుగా వచ్చేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.

Traffic jam occurred at Kaleshwaram-Kataram route

ఆదిలాబాద్‌లో హరీశ్ రావు పర్యవేక్షణ

ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు పర్యవేక్షిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద పెరిగిన రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

డిజిపి పర్యవేక్షణ

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాల కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ఆదివారం ఆయన బాసర, కాళేశ్వరం, ధర్మపురి పుష్కర ఘాట్లలో ఏర్పాట్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
ఆరుగురు మృతి

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్‌ మండలం అంబారీపేట వద్ద పుష్కరాలకు వచ్చిన భక్తుల వాహనాన్ని మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు యాత్రికులు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఘటనలో పుష్కర స్నానానికి వచ్చిన దంపతులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.

కేంద్రమంత్రి హన్స్ రాజ్ పుష్కరస్నానం

నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం పుష్కర స్నానం చేశారు. ఆదివారం ఆయన పుష్కర ఘాట్‌కు చేరుకుని పుణ్యస్నానమాచారించారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉన్నారు.

కాళేశ్వరంలో మధుసూధనాచారి పుష్కర స్నానం

రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించారు. పుష్కరఘాట్‌కు చేరుకుని పుణ్యస్నానం చేశారు. అనంతరం ఒకే పాణపట్టంపై వెలిసిన కాళేశ్వర, ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

English summary
Traffic jam occurred at Kaleshwaram-Kataram route on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X