హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీ నడిబొడ్డున నెలరోజులు ట్రాఫిక్ ఆంక్షలు..! తప్పదు.. భరించాలి మరి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సిటీ హార్ట్ లాంటి ప్రాంతంలో జనాలు కస్త సంయమనం పాటించాల్సిన సమయం వచ్చేసింది. నారాయణగూడ పరిసర ప్రాంతాలలో మూడు చోట్ల 1800 ఎంఎం సివరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనుల కారణంగా ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు నెల రోజుల పాటు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ ఆంక్షలు ఈనెల 4వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

నారాయణగూడ సెమెట్రీ గేట్ నెం.1 నుంచి గేట్ నెం.2, నారాయణగూడ సెమెట్రీ గేట్ నెం. 2 నుంచి విఠల్‌వాడి, రాజమెహల్లా దర్గా నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్స్ వరకు ఈ పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ దిగువ తెలిపిన ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లిం పు కొనసాగుతుందన్నారు. పైపులైన్ నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలను రోడ్డుపై ఆపి, అక్కడ జరుగుతున్న పనులను చూస్తూ ట్రాఫిక్ రద్దీకి కారకులుకావద్దని సూచించారు.

Traffic restrictions for 1 month.! on heart of the city.!have to bear..!!

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ, కింగ్ కోఠికి సెమెట్రీ ద్వారా వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు, ఈ వాహనాలను ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్, హైదర్‌గూడ వైపు మళ్లిస్తారు. కింగ్‌కోఠి నుంచి ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లే వాహనాలను సెమెట్రీ జంక్షన్ వద్ద విఠల్‌వాడీ వైపు మళ్లిస్తారు. విఠల్‌వాడీ, రాంకోఠి వైపు నుంచి ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళస్త్ల్ర వాహనాలను సెమెట్రీ జంక్షన్ నుంచి ఇడెన్ గార్డెన్, కింగ్‌కోఠి వైపు మళ్లిస్తారు.

వైఎంసీఏ నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్డుకు వెళ్లే వాహనాలను బర్కత్‌పురా చమాన్, విఠల్‌వాడీ వైపు మళ్లిస్తారు. రాంకోఠి ఎక్స్‌రోడ్స్, నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రూట్ వాహనాలు కాచిగూడ ఎక్స్ రోడ్డు వద్ద వైఎంసీఏ, బర్కత్‌పురా పోస్టాఫీస్, బర్కత్‌పురా చమాన్, టూరిస్ట్ హోటల్ మీదుగా వెళ్లాలి. ట్రాఫిక్ మళ్లింపు వల్ల కాస్త ఇబ్బందులు కలిగినా ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్నప్తి చేస్తున్నారు.

English summary
Traffic restrictions in those areas are likely to be operational for a month during the 1800 mm suburban pipeline construction works in Narayanaguda, city traffic additional police commissioner Anil Kumar said. These restrictions will be effective from 4th of this month until 6th of the next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X