హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణేష్ నిమజ్జనం, పటిష్ట భద్రత: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

హైదరాబాదులో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో సెప్టెంబర్ 5న నిమజ్జనం ఉంది.

నగరంలో 24 వేలమంది పోలీసులు, ఇతర భద్రత బలగాలను మోహరిస్తామని చెప్పారు. శనివారం రాత్రి సిద్దిఅంబర్‌ బజార్‌లోని బహేతి భవన్‌లో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన నిమజ్జన ఉత్సవాలకు భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.

గట్టి భద్రత

గట్టి భద్రత

ఈ సందర్భంగా మాట్లాడారు. భక్తుల ప్రాణ నష్టం వంటివి జరగకుండా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ప్రత్యేక బలగాలను నిమజ్జనంలో మొహరిస్తామన్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షనున్నట్లు తెలిపారు.

ఉదయం తీసుకు రావాలి

ఉదయం తీసుకు రావాలి

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భాగవత్‌ కూడా మాట్లాడారు. నిమజ్జనం చేసేందుకు రాచకొండ పరిధిలో పలు చెరువు వద్ద క్రేన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం వినాయకులను తీసుకురావాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. నిమజ్జన కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదన్నారు.

చెరువుల వద్ద పటిష్ట బందోబస్తు

చెరువుల వద్ద పటిష్ట బందోబస్తు

సరూర్ నగర్‌, సఫిల్‌గూడ, కాప్రా చెరువుల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

సరూర్ నగర్ చెరువుకు ఇలా

హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, సరూర్ నగర్‌ వైపు నుంచి విగ్రహాలతో వచ్చే వాహనాలు.. ఎల్బీనగర్‌ జంక్షన్‌, కొత్త పేట, దిల్‌సుఖ్‌నగర్‌, వెంకటాద్రి థియేటర్‌, జేసీ బ్రదర్‌ షోరూం కుడి వైపు నుంచి సరూర్‌నగర్‌ చెరువుకు చేరుకోవాలి.
చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, ముసారాంబాగ్‌, అంబర్‌పేట వైపు నుంచి వచ్చే విగ్రహాలు ముసారాంబాగ్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా రావాలి. కోణార్క్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ వద్ద యూ టర్న్‌ తీసుకోవాలి. గడ్డి అన్నారం క్రాస్‌ రోడ్‌ వద్ద ఎడువవైపు తీసుకుని శివగంగ థియేటర్‌, శంకేశ్వర్‌ బజార్‌ జంక్షన్‌ మీదుగా సరూర్‌నగర్‌ ట్యాంక్‌కు రావాలి.
సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, నాగార్జునసాగర్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి వచ్చే వాహనాలు.. సింగరేణి కాలనీ, శంకేశ్వర్‌ బజార్‌ మీదుగా చేరుకోవాలి.
నిమజ్జనం తర్వాత వాహనాలు.. కర్మాన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వైపుగా వెళ్లాలి.
సందర్శకుల వాహనాలు జ్యోతి క్లబ్‌, సరస్వతీ శిశుమందిర్‌, జెడ్‌పీహెచ్‌ఎస్‌లలో మాత్రమే పార్కింగ్‌ చేయాలి. నో పార్కింగ్‌ ప్రాంతాల్లో చేస్తే జరిమానాలు విధిస్తున్నారు.

సఫిల్ గూడ చెరువు వద్దకు

సఫిల్ గూడ చెరువు వద్దకు

సఫీల్‌గూడ చెరువు ప్రవేశ ద్వారం, వెంకటేశ్వర స్వీట్‌ షాపు మార్గాల నుంచి నిమజ్జన ప్రాంతానికి వాహనాలను అనుమతించరు.

నేరేడ్‌మెట్‌ క్రాస్‌రోడ్‌, ఆనంద్‌బాగ్‌ క్రాస్‌రోడ్‌, సఫిల్‌గూడ రైల్వే స్టేషన్‌ నుంచి వచ్చే బైక్స్‌, కార్లకు సఫిల్‌గూడ చెరువుకు నో ఎంట్రీ.

కాప్రా చెరువు వద్ద

సందర్శకుల వాహనాలను హైటెన్షన్‌ పవర్‌ ట్రాన్సిమిషన్‌ లేన్‌ రోడ్‌, కాప్రా వద్ద పార్కింగ్‌ చేయాలి. కాగా, బైరామల్‌హగూడ - చంపాపేట, ఎల్బీ నగర్ - ఉప్పల్, ఉప్పల్ -రామంతాపూర్, నేరేడ్‌మెట్ - సఫిల్‌గూడ, ఆర్కేపురం - ఈసీఐఎల్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు భారీ వాహనాలను అనుమతించారు.

English summary
The Cyberabad Police on Wednesday announced the imposition of traffic restrictions for Ganesh immersion ceremony in the city on September 5, next Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X