వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా టూర్: హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాల్లో వెళ్తే ఇబ్బందులే

జీఈఎస్ 2017 ( ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు), మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీఈఎస్ 2017 ( ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు), మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. జీఈఎస్ సదస్సును పురస్కరించుకొని విఐపిలు, వివిఐపిలు నగరంలో పర్యటిస్తున్నందున పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు.

ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!

జీఈఎస్ 2017 సదస్సు మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హజరుకానున్నారు.ఇవాంకా ట్రంప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హజరుకానున్నారు.

రెండు చోట్లే ఇవాంకా టూర్, హెలికాప్టర్‌లోనే మోడీ పర్యటన, ఎందుకంటే?రెండు చోట్లే ఇవాంకా టూర్, హెలికాప్టర్‌లోనే మోడీ పర్యటన, ఎందుకంటే?

నవంబర్ 28వ, తేదిన మెట్రో రైలును ప్రధానమంత్రి మోడీ ప్రారంభించనున్నారు. మెట్రో‌రైలులోనే కెసిఆర్, మోడీ అమీర్‌పేట నుండి మియాపూర్ వరకు ప్రయాణం చేయనున్నారు.వీటన్నింటి దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

జీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటుజీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటు

 హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నవంబర్ 28వ, తేదిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ప్రదాన మంత్రి మోడీ హైద్రాబాద్‌కు రానున్నారు. ఇవాంకా ట్రంప్ నవంబర్ 28వ, తేది తెల్లవారుజామున హైద్రాబాద్ చేరుకొంటారు. హైద్రాబాద్‌కు మోడీ నవంబర్ 28వ, తేది మధ్యాహ్నం చేరుకొంటారు. ప్రధాని మోదీ, ఇవాంకలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి వెళతారని డీజీపీ చెప్పారు. ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ చేరుకొన్న తర్వాత హెచ్‌ఐసీసీలోని జీఈఎస్‌ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు.అయితే జీఈఎస్ పరిసర ప్రాంతాలతో పాటు, మెట్రో రైలు ప్రారంభోత్సవం చేసే అమీర్‌పేట, మియాపూర్ ప్రాంతాల్లో కూడ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.అయితే ఇవాంకా హెచ్ఐసిసి నుండి బయటకు వెళ్ళే సమయంలో సమీప ప్రాంతాల్లోని ప్రజలను బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ మళ్ళింపు

ట్రాఫిక్ మళ్ళింపు

మంగళవారం ప్రధాని మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 28న మధ్యాహ్నం 12గంటల నుంచి కమర్షియల్‌ వాహనాలైన డీసీఎంలు, లారీలు, కంటైనర్లు, పెద్దవాహనాలను దారి మళ్లించనున్నారు. జహీరాబాద్‌, పటాన్‌చెరు, ముంబై నుంచి వచ్చే వాహనాలను ఔటర్‌రింగ్‌ రోడ్డుమీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3నుంచి 5.30 గంటల సమయంలో బస్సులు, ద్విచక్రవాహనాలు, కార్లకు అనుమతులున్నప్పటికీ మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ రహదారిలో ప్రయాణించే వారు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.

 ఫలక్‌నుమా, హెచ్ఐసిసిలో ట్రాఫిక్ ఆంక్షలు

ఫలక్‌నుమా, హెచ్ఐసిసిలో ట్రాఫిక్ ఆంక్షలు

జీఈఎస్ 2017 సమ్మిట్ హెటెక్స్‌లో జరగనుంది.ఈ సదస్సులో 1600 మంది ప్రతినిధులు పాల్గొంటారు. అయితే ప్రతినిధులు సదస్సు ప్రాంగంణం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలోనూ సదస్సు నుండి విఐపిలు, వివిఐపిల రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అయితే ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి మోడీ హెలికాప్టర్‌లో టూర్ చేయనున్నారు.

 ట్రాఫిక్ మళ్ళించే ప్రాంతాలివే

ట్రాఫిక్ మళ్ళించే ప్రాంతాలివే

కొండాపూర్ నుండి మియాపూర్ వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు ప్రకటించారు.చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మోహర్ పార్క్ జంక్షన్, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంతాల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు కూడ ట్రాఫిక్ మళ్ళించారు. మియా నుండి చందానగర్, పటాన్ చెరువు, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్ళించారు.పటాన్‌చెరువు నుండి కూకట్ పల్లికి, వెళ్ళే వారంతా బిహెచ్ఈఎల్ రోటరీ నుండి నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్ మోహర్ పార్క్, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, మోహిదీపట్నం వరకు మళ్ళించారు.

 మూడు షిఫ్టుల్లో పోలీసుల విదులు

మూడు షిఫ్టుల్లో పోలీసుల విదులు

జీఈఎస్ సదస్సును భద్రతా ఏర్పాట్లను తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఆయా ప్రాంతాల్లో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రధాని భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామన్నారు. 10,400 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారన్నారు. ఇవాంకా బస చేసే వెస్టిన్‌ హోటల్‌ వద్ద నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులు బస చేసే 13 హోటళ్ల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 మోడీ షెడ్యూల్‌లో మార్పులు

మోడీ షెడ్యూల్‌లో మార్పులు

ప్రధాని మోదీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. షెడ్యూల్‌ ప్రకారమైతే 28న మధ్యాహ్నం మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా మియాపూర్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వెళ్లాలి. కానీ, బేగంపేటలో దిగగానే బీజేపీ కార్యకర్తలతో 15 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో మియాపూర్‌కు వెళ్తారు.

 సాంప్రదాయబద్దంగా ఆహ్వనం

సాంప్రదాయబద్దంగా ఆహ్వనం

జీఈఎస్ ‌లోపాల్గొనేందుకు వస్తున్న ప్రతినిధులకు పర్యాటక శాఖ తరఫున నియమించిన వాలంటీర్‌లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలుకుతారు.అతిథులను వారికి కేటాయించిన విడిది కేంద్రాలకు పంపుతారు. ఆదివారం సాయంత్రం వరకు అధికారికంగా సుమారు 150 మందికి పైగా ప్రతినిధులు చేరుకున్నారు. కాగా అతిథులకు స్వాగతం పలకడానికి జీహెచ్‌ఎంసీ నగరంలో ప్రత్యేక హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది.

English summary
In view of the Hyderabad Metro Rail inauguration at Miyapur and other important events, the Cyberabad Police Commissioner Sandeep Shandilya said traffic restrictions would be imposed on Tuesday.Traffic proceeding from Miyapur towards Kondapur/Kothaguda should take diversion through Chandanagar, Nallagandla flyover, Gulmohar Park Junction, Hyderabad Central University, via Gachibowli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X