వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణపేట ఘటనలో మృతులంతా మహిళలే .. బోరున విలపిస్తున్న మృతుల బంధువులు

|
Google Oneindia TeluguNews

నారాయణ పేట జిల్లా మరికల్‌ మండలం తీలేరులో చోటు చేసుకున్న విషాదకర ఘటన అందరి మనసులను కలచి వేస్తుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలు 10 మంది మట్టి దిబ్బ కూలటంతో మృతి చెందారు. మృతులంతా మహిళలే కావటంతో తల్లిని కోల్పోయిన చిన్నారుల ఆక్రందనలతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలముకున్నాయి.

<strong>నారాయణపేట జిల్లాలో విషాదం .. మట్టిదిబ్బ కూలి పది మంది మృతి</strong>నారాయణపేట జిల్లాలో విషాదం .. మట్టిదిబ్బ కూలి పది మంది మృతి

నారాయణ పేట ఘటనలో మృతులంతా మహిళలే .. పీలేరు గ్రామవాసులుగా గుర్తింపు

కుంటలు తవ్వుతుండగా మట్టిదిబ్బలు విరిగి కూలీల మీద పడడంతో 10 మంది మృతి చెందారు. ఎండ ఎక్కువగా ఉండడంతో వీరంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా పీలేరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో పీలేరు గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఉపాధి హామీ కూలీల మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి

మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి


మట్టి దిబ్బలు ఒక్కసారి కూలిన ఘటనలో 10 మంది మృతి చెందిన విషాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీల మరణం దురదృష్టకరమన్నారు. మృతులు కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా మంత్రిని, అధికారులను కేసీఆర్ ఆదేశించారు. తీలేరు ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సహాయక చర్యలతో పాటు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్న శ్రీనివాస్ గౌడ్

సహాయక చర్యలతో పాటు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్న శ్రీనివాస్ గౌడ్

కూలీల మరణం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మట్టిదిబ్బల దగ్గర ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, ఘటనపై దర్యాప్తు చేయిస్తామని మంత్రి తెలిపారు. మట్టిదిబ్బల కింద కూర్చొని ఉండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని, రాత్రి కురిసిన వర్షానికి తడిసి మట్టిదిబ్బ కూలినట్లు ఆయన పేర్కొన్నారు.

మృతుల వివరాలు చూస్తే

మృతుల వివరాలు చూస్తే

1)పి. అనురాధ(30)
2) బీమమ్మ(40)
3) బుడ్డమ్మ(26)
4) బి.లక్ష్మి(28)
5) కె. లక్ష్మి(30)
6) మంగమ్మ(32)
7) అనంతమ్మ(45)
8) కేశమ్మ(38)
9) బి. అనంతమ్మ(35)
10) లక్ష్మి (28) లుగా గుర్తించారు.

English summary
The tragedy occurred in Narayapeta district Marikal Mandalam teeleru village.Workers who are working as Employment Guarantee Workers suddenly met with an accident of ditching the mud. 10 people were died in the mud collapsed incident .CM KCR is deeply sympathetic to the families of the deceased. All the dead are women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X