• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీ లోక్ సభ ఓట్ల లెక్కింపులో తేడా జరగొద్దు..! పక్కా పారదర్శకంగా ఉండాలన్న భన్వర్ లాల్..!!

|

హైదరాబాద్‌: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ కన్సల్టెంట్‌ భన్వర్‌లాల్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్‌ అధికారులకు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్‌లాల్‌ పాల్గొన్నారు.

23న చేపట్టే ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాలు..! పర్యవేక్షిస్తున్న సీఈసి సీనియర్‌ కన్సల్టెంట్‌ భన్వర్‌లాల్‌..!!

23న చేపట్టే ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాలు..! పర్యవేక్షిస్తున్న సీఈసి సీనియర్‌ కన్సల్టెంట్‌ భన్వర్‌లాల్‌..!!

ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్‌ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు.

అంతా పారదర్శకంగా ఉండాలి..! అందుకోసం శిక్షణ ఇస్తున్న భన్వర్ లాల్..!!

అంతా పారదర్శకంగా ఉండాలి..! అందుకోసం శిక్షణ ఇస్తున్న భన్వర్ లాల్..!!

రిటర్నింగ్‌ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్‌ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు.

అదికారుల్లో చైతన్యం ఉండాలి..! అప్పుడే పనిలో వేగం ఉంటుందన్న సీఈసి..!!

అదికారుల్లో చైతన్యం ఉండాలి..! అప్పుడే పనిలో వేగం ఉంటుందన్న సీఈసి..!!

ఈటీపీబీఎస్‌ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్‌లమీద క్యూఆర్‌ కోడ్‌ వంటివి స్కాన్‌ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్‌ ట్రైనర్‌లు వివరించారు. సువిధ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్‌ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు.

పకడ్బందీ శిక్షణ..! పాల్గొన్న సిబ్బంది..!!

పకడ్బందీ శిక్షణ..! పాల్గొన్న సిబ్బంది..!!

21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్‌ రిహార్సల్‌ నిర్వహించాలని భన్వర్‌లాల్‌ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్‌ కుమార్‌ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్‌ లాల్‌ హెచ్చరించారు.

English summary
Senior Election Commissioner Bhanwarlal has ordered the election officials to set up the counting of votes for 17 Lok Sabha seats in Telangana. The second phase of training was held Monday to Chief Electoral Officers, Returning Officers and Assistance Returning Officers on the counting process on 23rd of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more