హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యూష పేరిట ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌: కానుకగా ఇవ్వాలని తండ్రికి హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సవతి తల్లి చాముండేశ్వరి చేతిలో చిత్రహింసలకు గురైన యువతి ప్రత్యూష పేరిట ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి హైకోర్టుకు తెలిపారు.
తన తల్లి పేరున ఉన్న ఆ ఫ్లాట్‌ను ప్రత్యూష పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, ఆమెకు కానుకగా అందజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తండ్రి ఈ మేరకు స్పందించారు.

కాగా, ఆ ప్రకటనను నమోదు చేసిన ధర్మాసనం.. రిజిస్ట్రేషన్‌ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) శరత్‌కుమార్‌కు సూచించింది.

Transfer flat to Pratyusha, HC tells father
తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

సోమవారం ప్రత్యూష తండ్రి కోర్టుకు హాజరయ్యారు. ఎస్‌జీపీ వాదనలు వినిపిస్తూ.. తండ్రి పేరుమీద ఉన్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఆ యువతి తండ్రి అంగీకరించారని.. సంక్రాంతి సెలవులలోపే ఆ ప్రక్రియ పూర్తి చేస్తానన్నారని తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ అయ్యాక.. ఆ ఫ్లాట్‌ అద్దె ఆ యువతికి చెందేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌జీపీకి హైకోర్టు సూచించింది. ఆ ఫ్లాట్‌లో ఆద్దెకుండే వారు ప్రత్యూషతో ఒప్పందం చేసుకునేలా చూడాలని కోర్టు పేర్కొంది.

English summary
A division bench comprising acting Chief Justice Dilip B Bhosale and Justice S V Bhatt of the Hyderabad High Court on Monday directed tortured teen Pratyusha's father, Ramesh, to give his flat at LB Nagar to his daughter as a gift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X