హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్లు క్లియర్: ముగ్గురు మృతి, కూలిన చెట్లు 2500, బాలకృష్ణ నివాసం వద్ద కూడా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో శుక్రవారం సాయంత్రం అరగంట సేపు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీ ఈదురు గాలులకు తోడు వర్షం కురువడంతో నగరం చిగురుటాకులా వణికిపోయింది. భారీ చెట్లు, హోర్డింగ్‌లు నెలకూలాయి. విద్యుత్ స్తంభాలు, తీగలపై చెట్లు, కొమ్మలు పడటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఐదారు కిలోమీటర్ల దూరం దాటేందుకే దాదాపు గంట సేపు పట్టిన పరిస్థితి. జీహెచ్ఎంసీ అధికారులు శనివారం ఉదయానికి నగరంలోని రోడ్ల పరిస్థితిని మెరుగైన దశకు తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి, లక్డీకాపుల్, మెహిదీపట్నం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో అడ్డంకులు లేకుండా పూర్తిగా తొలగించారు.

దీంతో శనివారం ఉదయం వాహనదారులు పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాలేదు. రోడ్లు చాలావరకు క్లియర్ అయ్యాయి. రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించి, వాటిని నరికి రోడ్డకు పక్కగా వేసి ఉంచడం కనిపించింది. అలాగే రోడ్డుమీద నిలిచిపోయిన నీళ్లను కూడా మోటార్లతో తోడుతున్నారు.

భారీ వర్షం దెబ్బకు నెలకూలిన హోర్డింగులు, చెట్ల తొలగింపు పనులను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. కమిషనర్ జనార్ధన్‌రెడ్డి శనివారం ఉదయం 7 గంటల నుంచి నగరంలో పర్యటిస్తున్నారు. గాలి తీవ్రతకు జుబ్లీహిల్స్‌లో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన హోర్డింగుల తొలగింపును ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

దీంతో ప్రధాన రోడ్లలో వాహనాల రాకపోకలకు దాదాపు ఎక్కడా అంతరాయం కలగలేదు. అయితే కాలనీలలో మాత్రం పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగానే కనిపిస్తోంది. కాగా నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వేరు వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

తలాబ్‌ కట్టలోని జహంగీర్‌నగర్‌లో నివాసముంటున్న అహ్మద్‌ బిన్‌ ఇబ్రహీం(32) మృతి చెందగా, అతని సోదరుడు సలీల్‌బిన్‌ ఇబ్రహీం తీవ్రంగా గాయపడ్డాడు. తన తల్లి మరణించి 40 రోజుల సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తుండగా అహ్మద్‌ బిన్‌‌పై ఇంటెక్స్‌ ట్యాంక్‌, రేకులు కిందపడ్డాయి.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

ఇంటెక్స్‌ ట్యాంక్‌ ఒక్కఉదుటున అహ్మద్‌పై పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అతని సోదరుడు సలీల్‌ఖాన్‌కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు అత్తాపూర్‌లో నివాసముంటున్న భవన నిర్మాణ కార్మికుడు ఎల్లయ్య గోడకూలిపైన పడటంతో దుర్మరణం పాలయ్యాడు.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

రాజేంద్రనగర్‌లో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా వర్షం కురుస్తుండటంతో అత్తాపూర్‌ సమీపంలోని మారుతీనగర్‌లో ఓ ఇంటి వద్ద ఆగాడు. గాలివాన బీభత్సానికి గోడకూలి ఎల్లయ్యపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టోలీచౌక్‌లోని జానకీనగర్‌లో కమల్‌ అనే వెల్డర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

జానకీనగర్‌లోని భవనంలోని మూడో అంతస్తులో రేకులు బిగిస్తుండగా అకస్మాత్తుగా భారీ గాలి రావడంతో అక్కడ నుంచి కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృత్యువాతపడ్డాడు. హైదరాబాద్‌పై ప్రకృతి పగబట్టిందా అన్నంత కసిగా శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి దాదాపు 2500 చెట్లు కూలిపోయాయి.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణ నివాసం వద్ద, ప్రశాసన్‌నగర్‌ లోనూ పెద్ద చెట్లు విరిగిపోయాయి. ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి వద్ద కూడా అనేక చెట్లు నేలకూలాయి. సచివాలయంలోని నల్ల పోచమ్మ గుడి ఆవరణపై చెట్టు విరిగిపడడంతో శివుడి విగ్రహం ధ్వంసమైంది. డీజీపీ ఆఫీసులోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

చెట్టు కొమ్మ విరిగిపడడంతో ఓ అధికారి వాహనం ధ్వంసమైంది. రాజ్‌భవన్‌రోడ్డులో అనేక చెట్లు నేలకొరిగాయి. నెక్లెస్‌రోడ్‌ చౌరస్తాలో రెండు భారీ వృక్షాలు పడిపోయాయి. లంగర్‌హౌజ్‌ ప్రధాన రహదారిపై గోకుల్‌ బేకరి సమీపంలో భారీవృక్షం పక్కనే ఉన్నబిల్డింగ్‌పై పడటంతో గోడలు కూలాయి.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

అనుకోని వైపరీత్యాన్ని ఎదుర్కొనడానికి హైదరబాదీలు స్వచ్ఛందంగా ముందుకు దూకారు. ఎక్కడికక్కడ వాహనాల్లోంచి దిగి, విరిగిపడ్డ కొమ్మలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కొబ్బరిబోండాలు నరికే కత్తులు తెచ్చి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని నరికివేశారు. పదుల సంఖ్యలో యువకులు భుజంభుజం కలిపి పెద్దపెద్ద చెట్లను సైతం ఈడ్చి అవతల పారేశారు.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

ట్రాఫిక్‌ సమస్య కారణంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పలు చోట్లకు చేరలేకపోయారు. వీలైన ప్రాంతాల్లో 105 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపారు. అత్యవసరమైతేనే రోడ్ల మీదకు రావాలని టీవీలు, సమాచార సాధనాల ద్వారా ప్రజలకు సందేశం పంపారు. జలమండలి ఆధ్వర్యంలో 29 ఎమర్జెన్సీ బృందాలను, జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో 37 క్రేన్‌లను అందుబాటులో ఉంచారు.

 నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

రాత్రి కురిసిన వర్షానికి వందల మంది ప్రాణాలను అప్రమత్తతో కాపాడారు జూబ్లీహిల్స్‌ సీఐ వెంకటరెడ్డి. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ క్రమంలో పడిపోయిన హోర్డింగ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. మరోవైపు హోర్డింగ్‌ పడిపోయిన చోట శిథిలాల తొలగింపులో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

నగరంలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

హోర్డింగ్ పడిపోయిన సమయంలో తెగిపడిన విద్యుత్ వైర్లు... వాటిలో ఒకదాంట్లో కరెంట్‌ సరఫరా అవుతోందని ఇన్‌స్పెక్టర్‌ వెంకట రెడ్డి గమనించారు. హోర్డింగ్ చుట్టూ వందల సంఖ్యలో జనం గుమిగూడి ఉన్న నేపథ్యంలో అప్రమత్తతతో వ్యవహరించి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆపై ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్‌ చేసి సరఫరా నిలిపేయించారు.

English summary
Three persons were killed in mishaps as heavy rains coupled with strong winds and gales lashed the city on Friday evening. As many as 175 to 200 trees and electric poles were uprooted leading to power shutdowns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X