• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెక్కీ సతీష్ హత్యలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ!! చంపింది ప్రేయసి కొత్త లవరే..!!?

|

హైదరాబాద్/ అమరావతి : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సతీశ్‌ను హత్యచేసినట్టు భావిస్తోన్న అతని స్నేహితుడు హేమంత్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ స్వస్థలం భీమవరం. సతీశ్ హత్యతో ఏపీ వెళ్లిన కేపీహెచ్‌బీ పోలీసులు .. హేమంత్‌ను అరెస్ట్ చేసి .. హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రియురాలు ప్రియాంకను గత 24 గంటల నుంచి పీఎస్‌లో పోలీసుల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే హేమంత్, ప్రియాంకను కలిపి విచారిస్తే .. కేసు విచారణ కొలిక్కి వస్తోందని పోలీసులు చెప్తున్నారు.

వెలుగులోకి వాస్తవాలు

వెలుగులోకి వాస్తవాలు

సతీశ్ హత్య కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీశ్ స్నేహితురాలు అని భావించిన ప్రియాంక అతని లవర్ అని .. హేమంత్ కూడా ప్రియాంకతో ప్రేమాయణం నడిపాడని తెలుస్తోంది. వీరిద్దరికీ అమ్మాయి విషయంలోనే గొడవ జరిగిందని సమాచారం. కేపీహెచ్‌బీలోని సాప్ట్ వేర్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్న ప్రియాంక అక్కడే పనిచేశారు. తొలుత సతీశ్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే సతీశ్‌తో ప్రేమాయణం నడిపినట్టు సమాచారం. తర్వాత హేమంత్ లైన్‌లోకి వచ్చారు. తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. ఇటు హేమంత్‌ కూడా ప్రియాంక ప్రేమలో మునిగిపోయాడు. ఆమెతో ఉండేందుకు ఆఫీసు దగ్గరలో అపార్ట్ మెంట్ కూడా తీసుకున్నాడు. అయితే వీరిద్దరితో ప్రియాంక ప్రేమిస్తున్నట్టు నటించి .. కాలం వెళ్లదీసింది. తాజాగా సతీశ్‌తో ప్రియాంక ఉంటోంది. ఈ విషయం తెలిసి .. హేమంత్ రగిలిపోయాడు. ఏం చేయాలా అని వ్యుహరచన రచించాడు. ప్రణాళిక రచించి .. సతీశ్‌ను తన ఇంటికి పిలిచి ... హతమార్చాడు.

ఆర్థిక లావాదేవీలు కూడా

ఆర్థిక లావాదేవీలు కూడా

సతీశ్, హేమంత్‌కు ప్రియాంక విషయంతోపాటు ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. అదను కోసం చూసిన హేమంత్ .. తన స్నేహితుడిని హతమార్చాడు. సతీశ్ ఆచూకీ తెలియడం లేదని అతని భార్య ప్రశాంతి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఎవరిపైనా అనుమానం ఉందా అని ప్రశ్నిస్తే .. హేమంత్ అని చెప్పారు. తర్వాత ప్రియాంక గురించి అడిగితే మాత్రం తెలియలేదని చెప్పారు. ఇటు హేమంత్ ఫ్యామిలీలో కూడా ప్రియాంక గురించి తెలియదని చెప్తున్నారు. ఫ్యామిలీ వెర్షన్ ఇలా ఉంటే .. సతీశ్, హేమంత్ చివరగా మాట్లాడింది మాత్రం ప్రియాంకతోనే .. దీంతో ఈ కేసు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ప్రియాంక మూలంగానే హేమంత్ సతీశ్‌ను మట్టుబెట్టాడని తెలుస్తోంది.

స్నేహితుడే మట్టుబెట్టాడు

స్నేహితుడే మట్టుబెట్టాడు

ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన మైలా సతీశ్ బాబు, భీమవరానికి చెందిన హేమంత్ స్నేహితులు. వారిద్దరు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివించారు. ఏడాది క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ఇద్దరు కలిసి స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. భార్య ప్రశాంతితో కలిసి సతీశ్ మూసాపేట ఆంజనేయనగర్‌లో ఉంటుండగా .. హేమంత్ అల్వాల్‌లో ఉంటున్నారు. అయితే ఇటీవలే కేపీహెచ్‌బీలోని 7వ ఫేజ్‌లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. భార్యతో కాకుండా ఒంటరిగా ఉండటంలోనే ఏదో కుట్ర దాడి ఉందని తర్వాత తెలిసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police have made progress in the murder of software engineer Satish. His friend Hemant, who is believed to have murdered Satish, was taken into custody in Andhra Pradesh. Hemant hometown is Bhimavaram. KPHB police, who went to the murder of Satish, arrested Hemanth and brought to Hyderabad. Girlfriend Priyanka, on the other hand, has been raining questions from the police over the past 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more