• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్: అటవీశాఖ అధికారులపై గిరిజన రైతుల పెట్రోల్ దాడి, కలకలం(వీడియో)

|

వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ అటవీ శాఖ అధికారిణి, మరో అధికారిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్‌తో దాడి చేశారు.

భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిదిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోడుభూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతుండగా.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది.

ఈ క్రమంలోనే ఓ స్థానిక రైతు.. అటవీ అధికారిణిపై సెట్రోల్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించాడు. పోడు భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ భాదితురాలిని భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 tribal farmers petrol attack on forest officials in jayashankar bhupalpally district

బాలుడిపై లైంగిక వేధింపులు: ఆయాకు 20ఏళ్ల జైలు

మూడేళ్ల క్రితం నాటి కేసులో ఓ మహిళకు బాలమిత్ర కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే తొమ్మిదేళ్ల బాలుడిని.. పాతికేళ్ల వయస్సు గల ఆయా లైంగిక వేధింపులకు గురి చేసింది. ఈ ఘటనపై 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పీఎస్‌లో బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు..

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కాస్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది జ్యోతి అలియాస్‌ మంజులా అనే మహిళ. అక్కడే బాధిత బాలుడు చదువుతున్నాడు. బాలుడు వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో.. అతడితో అనుచితంగా ప్రవర్తించింది ఆ మహిళ. అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టింది.

అయితే, ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానంటూ ప్రతిఘటించడంతో.. అతని ప్రైవేట్‌ భాగాలపై సిగరెట్లు, లైటర్‌తో కాల్చి గాయపరిచింది. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి తండ్రి. విచారణ సమయంలో బాధిత బాలుడి సాక్ష్యం, వైద్య రికార్డులు, నేరం జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న మెటీరియల్స్‌‌ను పరిశీలించిన తర్వాత ఆమెపై పోక్సో చట్టం కింద సెక్షన్లు 324, 506 కింద ఆమెపై మోపబడిన అభియోగాలను పరిశీలించి దోషిగా నిర్ధారించింది కోర్టు. విచారణ అనంతరం పాఠశాల ఆయా జ్యోతికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ. 10వేల జరిమినా విధిస్తూ బాలమిత్ర కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

భార్య, అత్తను దారుణంగా హత్య చేశాడు

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి కూతురును అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మిలట్రీ హాస్పిటల్లో పని చేస్తున్న నాగ పుష్పతో అదే ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న చిన్న బాబుతో వివాహం జరిగింది. వీరితో పాటు నాగ పుష్ప తిరుమలగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

కాగా, కుటుంబంలో చిన్న గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికిలోనైన చిన్నబాబు.. నాగ పుష్పను, అడ్డుగా వచ్చిన ఆమె తల్లిని కత్తితో నరికి అతి కిరాతకంగా చంపేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుమల గిరి పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు.

మరో బాలికపై దారుణం..

సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలిక హత్యాచార ఘటన మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగారుబస్తీలో ఓ బాలికపై సుమిత్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. బాలిక అరుపులతో స్థానికులు ఘటనా స్థలికి వెళ్లి రక్షించారు. ఈ క్రమంలో సుమిత్ ను పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడు హబీబ్ నగర్ పరిధిలో చోరీ కేసులో కూడా నిందుతుడిగా ఉన్నాడు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
tribal farmers petrol attack on forest officials in jayashankar bhupalpally district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X