• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

lockdown effect:రేషన్ కోసం 30 కి.మీ నడక, చింతపండు రసం తాగి, దుర్భరంగా ఆదివాసీల జీవనం...

|

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఆదివాసీల పాలిట శాపంగా మారింది. 21 రోజుల లాక్‌డౌన్‌తో ఆదివాసీల జీవనం మరింత దుర్భరంగా మారింది. నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల ఆమ్రాబాద్ ఆదివాసీల బాధలు అన్నీ ఇన్నీ కావు. తమకు కావాలసిన ఆహార వస్తువుల కొనుగోలు కోసం వారు 30 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి.

కరోనా లాక్‌డౌన్..?: మరోసారి మీడియా ముందుకు మోడీ..? పొడిగింపుపై ప్రకటించే ఛాన్స్...

చెంచుల వెతలు

చెంచుల వెతలు

లాక్ డౌన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం బియ్యంతోపాటు నగదు కూడా అందజేస్తోంది. అయితే వారంతా అప్పయపల్లి, మన్నాన్‌పూర్ రావాల్సి ఉంది. తమ నివాసం ప్రాంతం నుంచి సుదూరం నడవడమే గాక టైగర్ రిజర్వ్ ఏరియా దాటి రావాల్సి ఉంది. ఆ ప్రాంతంలో చిరుతపులులు, ఎలుగుబంట్లు ఉంటాయి. నిత్యవసరాలు తీసుకోలేక, సుదూరం నడిచే సాహసం చేయడం లేదు. క్రూరమృగాలు ఏం చేస్తాయనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అలా వెళ్లలేక తమ వద్ద ఉన్న చింతపండుతో రసం చేసుకొని తాగుతున్నారు.

ఆరు తర్వాత అక్కడే..

ఆరు తర్వాత అక్కడే..

తన తల్లి సరుకుల కోసం అప్పయపాలెం వెళ్లిందని.. సాయంత్రం 6 గంటలు కావడంతో అక్కడే ఉండిపోయిందని సురయ్య అనే చెంచు తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి రవాణా సదుపాయం లేని సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కన్నా ముందు అందరం కలిసి ఆటో కిరాయికి తీసుకొని వెళ్లేవారమని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. మేం వెళితే 30 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి.. లేదంటే ఇక్కడే ఆకలితో అలమటించాలి అని తమ పరిస్థితిని చెప్పుకొని కన్నిటీ పర్యంతమయ్యాడు. చాలా మంది చింతపండు రసం చేసుకొని.. తాగుతూ కాలం వెళ్లదీస్తున్నామని తమ దుర్భర స్థితిని పేర్కొన్నారు. తమ సమీప ప్రాంతాల వరకు ఆటోలు నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు.

137 కుగ్రామాలు..

137 కుగ్రామాలు..

రాజధాని హైదరాబాద్‌కు చెంచుల గ్రామాలు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 137 కుగ్రామాలు ఉన్నాయి. ఒక్కో ఊరికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమ పంటలతోనే జీవనోపాధి పొందుతున్నామని మరో చెంచు నిమ్మల బయ్యన్న తెలిపారు. అటవీలో పండిస్తోన్న పంటను విక్రయిస్తే.. తమకు కావాల్సిన బియ్యం కొనుగోలు చేయొచ్చుని తెలిపారు. బియ్యం కోసం 30 కిలోమీటర్లు వెళ్లే పరిస్థితి లేదని.. అందుకోసమే మడిపి గింజలు తిని జీవిస్తున్నామని పేర్కొన్నారు.

అప్పుడు కూడా..

అప్పుడు కూడా..

గిరిజనుల వెతలపై ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ అధికారి అఖిలేశ్ రెడ్డి స్పందించారు. వారికి కావాలసిన రేషన్ సరుకులను గ్రామీణ కో ఆపరేటివ్ కార్పొరేషన్ వేర్ హౌస్ నుంచి అందిస్తున్నామని తెలిపారు. అప్పయపల్లిలో ప్రతీ బుధవారం, గురువారం అందజేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ కాదు అంతకుముందు కూడా ఇదే పరిస్థితి అని తెలిపారు. అటవీలో ఎలాంటి ఆంక్షలు లేవు అని.. అక్కడికి రవాణా సదుపాయం కూడా ఎలాంటి షరతులు విధించలేదు అని పేర్కొన్నారు. అయితే అక్కడ ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, తగిన సాయం అందిస్తామని చెప్పారు.

  Mohan Babu Adopts 8 Villages In Chittoor District

  English summary
  Tribals walk 30km for food, survive on tamarind juice in some telangana chencu tribals.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X