వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ మర్డర్: ఊరికెళ్తే బతికేవారే, చంపి కాలనీ ప్రెసిడెంట్‌కు చెప్పాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భార్యా, పిల్లల్ని తెల్లవారుజామున చంపేసిన హరీందర్ గౌడ్, తెల్లారి తాపీగా ఆ విషయాన్ని కాలనీ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళి చెప్పాడు.పోలీస్ స్టేషన్‌కు వెళ్ళేందుకు రావాలని అభ్యర్థించాడు. కాలనీ ప్రెసిడెంట్ పదే పదే ప్రశ్నించడంతో భార్య, పిల్లలను చంపేసినట్టు నిందితుడు రవీందర్ చెప్పాడు. హైద్రాబాద్ జిల్లెలగూడలో చోటు చేసుకొన్న ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడు హరీందర్ గౌడ్ పాల్పడిన దుర్మార్గాన్ని ఎవరూ కూడ జీర్ణించుకోలేకపోతున్నారు.

క్షణికావేశంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి ఆ శవాల మధ్యే నిందితుడు తెల్లవారుజాము వరకు ఉన్నాడు. ఏదైనా ఉద్యోగం చూసుకోవాని భార్య చెప్పడంతో ఇష్టం లేని హరీందర్ గౌడ్ ఆమెతో గొడవపెట్టుకొని చంపేశాడు.

నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను కూడ గొంతు నులిమి చంపేశాడు. ఆర్థిక ఇబ్బందులుంటే తాము చూసుకొంటామని అత్తింటివారు,. పుట్టింటి వారు హరీందర్ గౌడ్ హమీ ఇచ్చారు. కానీ, అతను మాత్రం క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు తీశాడు.

చంపేసీ తెల్లవారేవరకు చూశాడు

చంపేసీ తెల్లవారేవరకు చూశాడు


మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకొంది. జిల్లెలగూడలో నివాసం ఉంటున్న హరీందర్ గౌడ్ తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆదివారం అర్ధరాత్రిపూట వారిని హత్య చేసి తెల్లవారే వరకు ఎదురుచూశాడు. తెల్లవారిన తర్వాత కాలనీ ప్రెసిడెంట్ వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు. ఎందుకు పోలీస్ స్టేషన్‌ ఎందుకని కాలనీ ప్రెసిడెంట్ పదే పదే ప్రశ్నిస్తే భార్య, పిల్లలను చంపినట్టు హరీందర్ గౌడ్ చెప్పాడు.దీంతో ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో మూడు శవాలు కన్పించినట్టు కాలనీ ప్రెసిడెంట్ చెప్పాడు.

ఊరెళ్ళినా బతికేవారేమో

ఊరెళ్ళినా బతికేవారేమో


హరీందర్ గౌడ్ చేతిలో ప్రాణాలు పోవడానికి కొన్ని గంటల ముందే హరీందర్ గౌడ్ పిల్లలు వాళ్ళ తాతయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఊరెప్పుడు తీసుకెళ్తావు తాతయ్య అంటూ ఫోన్లో ప్రశ్నించారు. ఊరెళ్ళినా ప్రాణాలు దక్కేవని ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

వ్యాపారం నడవడం లేదు

వ్యాపారం నడవడం లేదు

దంత వైద్యులు ఇచ్చే ఆర్డర్ల మేరకు హరీందర్ గౌడ్ దంతాలను తయారు చేస్తారు. మలక్‌పేటలో హరీందర్‌గౌడ్‌లో కార్యాలయం ఉంది. రెండేళ్ళ నుండి వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. దీంతో ఆర్థికంగా హరీందర్ గౌడ్ చితికిపోయాడు. అయితే అత్తింటివారు, పుట్టింటివారు హరీందర్ గౌడ్ ను ఆదుకొంటున్నారు.స్కూల్ ఫీజులను కూడ అత్తింటివారే కడుతున్నారు.

మానసికంగా కుంగిపోయిన హరీందర్

మానసికంగా కుంగిపోయిన హరీందర్


రెండేళ్ళుగా వ్యాపారం నడవకపోవడంతో వేరే ఉద్యోగం చేసుకోవాలని భార్య జ్యోతి భర్తపై ఒత్తిడి పెంచింది. దీంతో భార్య, భర్తల తరచూ గొడవలు జరిగేవి. అయితే పెద్దలు వారికి సర్దిచెప్పారు. ఇదే సమయంలో మానసికంగా కృంగిపోయిన హరీందర్‌ను కుటుంబసభ్యులు ట్రీట్ మెంట్ కూడ ఇప్పించారు.

English summary
A case of triple murder came to light from Hyderabad's Jillelaguda area on Monday morning.Harinder killed his wife Jyothi and two children. His son Abhijeet was 6-year-old and daughter Sahasra was 4-year-old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X