హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రి వారించినా మధుతోనే పెళ్ళి, యామినీతో ఫోన్లో గొడవ, ఆ రోజు మధు ఏం చేశాండంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమ పెళ్ళికి తండ్రి అంగీకరించలేదు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి వారిద్దరికీ వివాహం జరిపించింది. ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. జీవితాంతం సుఖంగా ఉంటారని తల్లి భావించింది. కానీ ప్రేమించి పెళ్ళి చేసుకొన్నవాడే కాలయుముడుగా మారాడు.మూడు తరాలను మట్టుబెట్టాడు. పెళ్ళి చేసుకొన్న విషయాన్ని దాచిపెట్టి అపర్ణను పెళ్ళి చేసుకొన్నాడు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఆ కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు చందానగర్ ఘటనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

హైద్రాబాద్ చందానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు హత్యకు గురయ్యారు. జనవరి 26వ, తేదిన అపర్ణ, ఆమె తల్లి విజయలక్ష్మి, అపర్ణ కూతురు కార్తికేయను మధు హత్య చేశాడు.

అపర్ణ భర్తే మధు. మొదట వివాహం చేసుకొన్న విషయాన్ని దాచి పెట్టి మధు అపర్ణను వివాహం చేసుకొన్నాడు అయితే ఈ విషయం తెలిసి మధు మొదటి భార్య అపర్ణతో గొడవ పడింది. అపర్ణ, యామినీలు వేర్వేరుగా కేసులు పెట్టారు. ఈ కేసుల నుండి బయటపడడంతో పాటు విసిగిస్తున్నారనే కోపంతోనే మధు అపర్ణను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

తండ్రి మరణించాక మధుతో అపర్ణ వివాహం

తండ్రి మరణించాక మధుతో అపర్ణ వివాహం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విజయలక్ష్మి , మురళి దంపతుల కూతురు అపర్ణ.అపర్ణ కెపిహెచ్‌బిలోని ఓ షోరూమ్‌లో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తోంది. చందానగర్‌లో అపర్ణ తల్లిదండ్రులతో కలిసి ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా ఉల్లంపర్రుకు చెందిన మధుతో అపర్ణకు పరిచయం ఏర్పడింది. అతను కూడ చందానగర్‌లో ఉండేవాడు. అపర్ణ, మధుల మధుల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే మధు వ్యవహరశైలి నచ్చని అపర్ణ తండ్రి మధుకు అపర్ణను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేదు. అపర్ణ తండ్రి మరణించాడు. ఆ తర్వాత మధులు, అపర్ణకు విజయలక్ష్మి వివాహం చేసింది. అయితే అప్పటికే మధుకు యామినీ వివాహం జరిగింది. ఈ విషయాన్ని దాచిపెట్టి అపర్ణను మధు వివాహం చేసుకొన్నాడు.

కెపిహెచ్‌బి కాలనీ మొదటి భార్యతో మధు నివాసం

కెపిహెచ్‌బి కాలనీ మొదటి భార్యతో మధు నివాసం

కెపిహెచ్ బి 4ఫేజ్‌లో మొదటి భార్య యామినీతో మధు నివాసం ఉంటున్నాడు. మొదటి భార్యు తెలియకుండా అపర్ణ దగ్గరకి వచ్చి వెళ్లేవాడు. మొబైల్‌ ఫోన్ల దుకాణం నిర్వహిస్తూ చాటుమాటుగా ఇద్దరితోనూ కాపురం చేస్తూస్తున్నాడు. ఎట్టకేలకు అయితే అపర్ణను మధు రెండో పెళ్లి చేసుకున్న విషయం యామినికి తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. అపర్ణ ఇంటికి వచ్చిన యామినీ గొడవపడింది.

ఇద్దరు భార్యల మధ్య గొడవలు, కేసులు

ఇద్దరు భార్యల మధ్య గొడవలు, కేసులు

ఒకరికి తెలియకుండా మరోకరిని మధు వివాహం చేసుకొన్నాడు. అయితే అపర్ణ వ్యవహరం యామినికి తెలిసి అపర్ణ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి తరచూ గొడవకు దిగేది. అపర్ణ అంతు చూస్తానని బెదిరింపులకు దిగేదని స్థానికులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ యామినీ, చందానగర్ పోలీస్ స్టేషన్లో అపర్ణలు కేసులు పెట్టారు. ఇద్దరితోనూ మధుకు గొడవలు పెరిగిపోయాయి.

యామినీకి ఫోన్ చేసి గొడవ పడిన అపర్ణ

యామినీకి ఫోన్ చేసి గొడవ పడిన అపర్ణ

అపర్ణ హత్యకు గురి కావడానికి నాలుగు రోజుల ముందు అపర్ణ యామినీకి పోన్ చేసింది. గొడవ పడింది. అయితే అపర్ణ ఫోన్ చేసి గొడవ పడిన విషయాన్ని యామినీ రికార్డ్ చేసి భర్త మధుకు వినిపించింది. దీంతో ఈ గొడవలకు చెక్ పెట్టాలంటే అపర్ణను హత్య చేయాలని మధు భావించారు.

ఆ రోజు ఏం జరిగిందంటే

ఆ రోజు ఏం జరిగిందంటే

యామినీకి ఫోన్ చేసి అపర్ణ గొడవ పడడం, పోలీసు కేసులతో భరించలేక పోయిన మధు జనవరి 26వ, తేదిన మధ్యాహ్నం బాగా మద్యం సేవించి అపర్ణ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అయితే అప్పటికే అపర్ణ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని మధుకు అనుమానం కూడ ఉంది. మధు బాగా మద్యం సేవించి రావడంతో అపర్ణ తల్లి విజయలక్షి మధును తిట్టింది. దీంతో విజయలక్ష్మిని కొట్టాడు మధు. ఆమె కింద పడగానే టవల్‌తో గొంతు బిగించి చంపేశాడు. తర్వాత కార్తికేయను కూడ చంపేసి మంచంపై పడుకోబెట్టాడు తల్లి, కూతురును చంపిన విషయాన్ని గుర్తించిన అపర్ణ గొడవ పెట్టుకోవడంతో అపర్ణను రోకలిబండతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు.

English summary
In a ghastly incident, three of a family were found murdered in a flat at Vemukunta under Chandanagar police station limits near Serilingampally on the outskirts of Hyderabad on Monday. The police suspect that the estranged husband of one of the victims, Aparna, might have killed her along with her daughter and her elderly mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X