వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్ర పరిశ్రమకు సినిమా కష్టాలు..!దుమారం రేపుతున్న తలసాని వాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో చురుకైనా భూమిక పోషించే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం, షూటింగుల అంశాలపై స్పందించారు మంత్రి తలసాని. సినిమా హాల్స్ తెరిచే అంశపై మాట్లడిన తలసాని వ్యాఖ్యలు సినిమా పరిశ్రమను మరింతి అగాధంలోకి నెట్టే పరిస్థితులు తలెత్తాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కోట్లాది ప్రేక్షకులకు వినోదం పంచే సినిమా థియేటర్లు తెరుచుకునే విషయంపై మంత్రి మాట్లడిన తీరు సహేతుకరంగా లేదని తెలుగు సినిమాకు సంబంధిచిన పెద్దలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

 శ్రీవారి భక్తుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం: కరోనా వ్యాప్తి చెందకుండా: అయినా..54 రోజులుగా శ్రీవారి భక్తుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం: కరోనా వ్యాప్తి చెందకుండా: అయినా..54 రోజులుగా

దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు.. లోతుగా చర్చించుకుంటుంన్న సినీ పెద్దలు..

దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు.. లోతుగా చర్చించుకుంటుంన్న సినీ పెద్దలు..

ఆచి తూచి స్పందించే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలిందా అనే అంశం ఇప్పుడు చర్చనీయంశమైంది. తన సొంత శాఖకు సంబంధించిన అంశంపై స్పందించి ఆయన కొత్త తలనొప్పిని తెచ్చుకున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. సినిమా పరిశ్రమ గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించిన అంశం దుమారం రేపుతోంది. హైదరాబాద్ నగరంలో మల్టీ ప్లెక్స్ లను, సినిమా థియేటర్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇచ్చిన సమాధానం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ముందే కారోనా కష్టాలు.. నష్టాలను చవిచూస్తున్న సినిమా పరిశ్రమ..

ముందే కారోనా కష్టాలు.. నష్టాలను చవిచూస్తున్న సినిమా పరిశ్రమ..

కాగా లాక్‌డౌన్ వేళ సినిమా థియేటర్లు తెరిస్తే నూతల సమస్యలు తలెత్తుతాయని, ఒకవేళ సినిమా హాళ్లు తెరిచినా కరోనా వైరస్ భయంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అంత సుముఖత చూపరని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారంగా మారాయి. అంతేకాదు, వ్యక్తికి, వ్యక్తికి మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుగా థియేటర్ల సీట్ల సిట్టింగులో మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు మంత్రి తలసాని. ఐతే మల్టీ ప్లెక్సుల్లో సీట్ల మార్పులు వేగంగా చేసినప్పటికి, జిల్లాల్లోని థియేటర్లలో చేసే సీట్లలో మార్పులు మాత్రం అంత తేలిక కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మొత్తంగా మరో మూడు.. నాలుగు నెలల వరకూ థియేటర్లు తెరిచే అవకాశం లేదన్న అభిప్రాయానన్ని తలసాని వ్యక్తం చేయడం సినీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

మూడు నెలలు థియేటర్లు తెరుచుకోవంటే ఎలా... సంచలనంగా మారిన మంత్రి వాఖ్యలు..

మూడు నెలలు థియేటర్లు తెరుచుకోవంటే ఎలా... సంచలనంగా మారిన మంత్రి వాఖ్యలు..

మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త సమస్యలకు తావిచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా నడుస్తున్న సినిమా రంగం, మంత్రి తలసాని వ్యాఖ్యలతో అగమ్యగోచరంలో పడినట్టు చర్చ జరుగుతోంది. మరో మూడు నెలల పాటు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదని ఆయన ప్రస్తావించకుండా ఉండి ఉండాల్సిందన్న అభిప్రాయం సినీ ప్రముఖుల నుండి వ్యక్తమవుతోంది. సినిమా రంగానికి చెందిన పలువురు పెద్దలు తలసాని మాటలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేని రీతిలో ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఊహించని ప్రతిస్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

తన వ్యాఖలను కావాలనే తప్పుబడుతున్నారన్న మంత్ర.. ఇక ఆపాలని ప్రసారమాద్యమాలకు సూచన..

తన వ్యాఖలను కావాలనే తప్పుబడుతున్నారన్న మంత్ర.. ఇక ఆపాలని ప్రసారమాద్యమాలకు సూచన..

ఇక ఇదే అంశంపై జరుగుతున్న చర్చ పట్ల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ విషయంలోనూ తనను తప్పు పట్టని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, తన శాఖకు సంబంధించిన అంశంపై తన ప్రమేయం లేకుండా స్పందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని మరింత చిలవలు పలవలుగా వర్ణించాల్సిన అవసరం లేదని తలసాని హితవు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మీడియాలో కూడా పదేపదే ఇదే వార్త పునరావృతం అవ్వడం పట్ల కూడా తలసాని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే తలసాని చెప్పినట్లుగా మరో మూడు నెలల పాటు థియేటర్లు పునఃప్రారంభం కాకపోతే మాత్రం చిత్ర పరిశ్రమకు సినిమా కష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది.

English summary
Multiplexes in Hyderabad Minister Talasani Srinivasa Yadav's answer to when to open movie theaters has become a sensation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X