వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్ర‌బుల్స్ లో ట్ర‌బుల్ షూట‌ర్..! లోక్ స‌భ ఎన్నికల‌కు హ‌రీష్ దూరం..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TRS Party Senior Leader Harish Rao In Troubles | Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నిక‌ల్లో మంచి వ్యూహ‌కర్త‌గా పేరున్న మాజీ మంత్రి హ‌రీష్ రావు గులాబీ పార్టీలో త‌న ప్రాబ‌ల్యాన్ని త‌గ్గించుకుంటున్నారు. గులాబీ పార్టీ రెండోసారి అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌రీష్ రావు కు అంత ప్రాముఖ్య‌త ల‌భించ‌డం లేదు. రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో అంటిముట్ట‌న‌ట్టు వ్మ‌వ‌హ‌రిస్తున్న హ‌రీష్ రావు భ‌విష్య‌త్ వ్యూహం ఏంటో అర్థం కాక ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సంద‌ర్బాలు కూడా లేక పోలేదు. తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్క‌ని హ‌రీష్ రావు కు లోక్ స‌భ ఎన్నిక‌ల నిర్వ‌హణ బాద్య‌తలు క‌ట్ట‌బెడ‌తార‌ని అంద‌రూ ఊహించారు. కాని ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఆ అవ‌కాశం కూడా ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరుతెచ్చుకున్న హ‌రీష్ రావు ఇవ్వ‌డం లేదు.

మంత్రులకు లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు..! ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ జోక్యం లేన‌ట్టే..!!

మంత్రులకు లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు..! ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ జోక్యం లేన‌ట్టే..!!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్లమెంటు ఎన్నికలపై వ్యూహరచన ప్రారంభించారు. తాను స్వయంగా ఖమ్మం, మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రులకు వారి వారి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో నియోజకవర్గాల పర్యవేక్షణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులు ఇతర అంశాల సమన్వయం చేయిస్తారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించిన తర్వాత తాజాగా ఆయన బాధ్యతల విషయమై తుది నిర్ణయం తీసుకున్నారని స‌మాచారం.

మూడు నియోజకవర్గాలకు బాద్య‌త‌ ముఖ్యమంత్రిదే..! హ‌రీష్ ను ప‌రిగ‌న‌లోకి తీసుకోని సీయం..!!

మూడు నియోజకవర్గాలకు బాద్య‌త‌ ముఖ్యమంత్రిదే..! హ‌రీష్ ను ప‌రిగ‌న‌లోకి తీసుకోని సీయం..!!

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ శాసనసభ స్థానం ప్రస్తుతం మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. జహీరాబాద్‌ మెదక్‌ పూర్వ జిల్లాతో పాటు నిజామాబాద్‌ పూర్వ జిల్లాలో ఉంది. ప్రస్తుతం మెదక్‌ జిల్లా నుంచి కేసీఆర్‌ ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించాలని నిర్ణయించారని తెలుస్తోంది. జహీరాబాద్‌లో సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా బాధ్యతలు పంచుకుంటారు.

 ఎక్కువ నియోక వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జిగా కేసీఆర్‌..! ఖ‌మ్మం నేత‌ల‌పై ఆగ్ర‌హం..!!

ఎక్కువ నియోక వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జిగా కేసీఆర్‌..! ఖ‌మ్మం నేత‌ల‌పై ఆగ్ర‌హం..!!

మంత్రివర్గంలో ప్రస్తుతం ఖమ్మం నుంచి ఎవరూ లేరు. ఆ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో సంభవించిన పరిణామాలపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే అక్కడ తెరాసకు విజయం దక్కింది. పార్టీ నేతల అంత‌ర్గ‌త విబేదాల‌తో ఓడిపోయారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి అవాంఛనీయ పరిణామాలను నిరోధించి, నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో ఖమ్మంకు సైతం ఆయనే ఇన్‌ఛార్జిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మిగిలిన లోక్‌సభ సీట్ల‌కు కూడా మంత్రులే ప‌రిశీల‌కులు..! ఖ‌రారు చేసిన సీయం..!!

మిగిలిన లోక్‌సభ సీట్ల‌కు కూడా మంత్రులే ప‌రిశీల‌కులు..! ఖ‌రారు చేసిన సీయం..!!

వరంగల్‌, మహబూబాబాద్‌: ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్‌: ఈటల రాజేందర్‌, సికింద్రాబాద్‌: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్కాజిగిరి, చేవెళ్ల: మల్లారెడ్డి, భువనగిరి, నల్గొండ: జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌: శ్రీనివాస్‌గౌడ్‌, నాగర్‌కర్నూలు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆదిలాబాద్‌: ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌: ప్రశాంత్‌రెడ్డి, పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్ లు ఇన్ చార్జులుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మంత్రుల‌కు కీల‌క బాద్య‌త‌లు అప్ప‌జెప్పిన చంద్రేశేఖ‌ర్ రావు అల్లుడు హ‌రీష్ రావు కు మాత్రం ఎలాంటి బాద్య‌త‌ల‌ను క‌ట్ట‌బెట్ట‌లేదు. దీంతో లోక్ స‌భ ఎన్నికల్లో ట్ర‌బుల్ షూట‌ర్ పాత్ర
నామ మాత్రంగా ఉండ‌బోతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
Harish Rao, who is untouchable in political affairs, was not aware of the future strategy and did not even face the sympathy of his followers. Everyone assumed that the Lok Sabha elections will be held in the Hareesh rao cooperation. But Chief Minister Chandrasekhar Rao does not even give an opportunity for the tribute shooter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X