వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న హ‌రీష్ వ్యాఖ్య‌లు..! పార్టీ ప‌ట్ల విధేయ‌త చాటుకునే విధానం ఇదేనా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల ప‌ట్ల ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు ఫిర్యాదు..!

హైద‌రాబాద్: గులాబీ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీష్ రావు తాను స్వ‌యంగా చేసిన వ్యాఖ్య‌లు పార్టీని ట్ర‌బుల్స్ కి గురిచేస్తున్నాయి. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా హ‌రీష్ రావ్ వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లోదూమారం రేపుతున్నాయి. పార్టీపై ఉన్న విధేయ‌త‌ను చాటుకునేందుకు హోదాను కూడా మ‌ర్చిపోయి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం గులాబి శ్రేణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి.

గ‌జ్వేల్ లో ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డిచేసిన వ్యాఖ్య‌లు ఆ త‌ర్వాత టిడిపి నేత రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ.. హ‌రీష్ రావ్ స‌హ‌నం కోల్పోయి మాట్లాడారు. ఓ ప‌క్క కౌంట‌ర్ ఇవ్వాల‌న్న తొంద‌ర‌పాటు మ‌రో ప‌క్క పార్టీకి విధేయుడినే అని చెప్పుకునే ఆరాటం హ‌రీష్ రావ్ ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వేసింది. అంతే కాకుండా హ‌రీష్ రావు చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు ఫిర్యాదు చేసారు తెలుగు దేశం నేత‌లు.

 పార్టీలో హ‌రీష్ కామెంట్ల క‌ల‌క‌లం..! డ్యామేజ్ త‌ప్ప‌దంటున్న శ్రేణులు..!!

పార్టీలో హ‌రీష్ కామెంట్ల క‌ల‌క‌లం..! డ్యామేజ్ త‌ప్ప‌దంటున్న శ్రేణులు..!!

తెలంగాణా రాజ‌కీయాలు వాడి వేడిగా న‌డుస్తున్నాయి. ముఖ్యంగా గ‌జ్వేల్, సిద్దిపేట రాజ‌కీయాలు రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. నేత‌ల ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న ఆరోప‌ణ‌లు శృతి మించ‌డ‌మే కాకుండా సంచ‌న‌లంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల్లో ఒక‌రి మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు మ‌రొక‌రు చేస్తున్న కామెంట్లు ఆ పార్టీ నేత‌ల‌కు ఇబ్బంది క‌ర ప‌రిస్థితుల‌ను క‌లిగిస్తున్నాయి. ఇదే కోవ‌లో కాంగ్రెస్ నేత ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి, టిడిపి నేత రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో దూమారం రేపాయి. వీరికి కౌంట‌ర్ ఇచ్చే క్ర‌మంలో హ‌రీష్ రావ్ స్థాయిని మ‌ర్చి వ్యాఖ్య‌లు చేశారు.

స‌హ‌నం కోల్పోయిన హ‌రీష్..! సాటి నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు..!!

స‌హ‌నం కోల్పోయిన హ‌రీష్..! సాటి నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు..!!

మంత్రి స్థానంలో ఉన్న హ‌రీష్ వ్యాఖ్య‌లు తెలంగాణా ప్ర‌జానికాన్ని ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. స‌హ‌నం కోల్పోయి చేసిన వ్యాఖ్య‌లు హ‌రీష్ ను కొంత ఇబ్బందుల‌కు గురి చేశాయి. నాలుక చీరేస్తా, అన‌డ‌మే కాకుండా సాటి రాజ‌కీయ నేత‌ల‌ను వాడు, వీడు అని సంబోధిస్తూ.... హ‌ద్ద‌లు దాటార‌ని చర్చ జ‌రుగుతోంది. హ‌రీష్ రావ్ టిఆర్ ఎస్ పార్టీని ఎప్ప‌టికైనా వీడుతార‌ని తాను ఖ‌చ్చితంగా పార్టీ మారుతార‌నే వ్యాఖ్య‌లు తారా స్థాయిలోన‌డుస్తున్న నేప‌థ్యంలో తాను పార్టీకి ఎప్పుడూ విదేయ‌త‌గా ఉంటాన‌ని, పార్టీ మారే ప్ర‌స్త‌క్తే లేద‌ని సంకేతాలు ఇచ్చే క్ర‌మంలో హ‌రీష్‌రావ్ తొంద‌ర‌ప‌డి ఇబ్బందులు కొని తెచ్చుకున్న‌ట్లు రాజ‌కీయ నాయ‌కులు విశ్లేషిస్తున్నారు.

హ‌రీష్ దిగ‌జారుడు రాజ‌కీయం..! భావోద్వేగాలు ఇప్పుడు తావు లేదంటున్న ప్ర‌తిప‌క్షాలు..!

హ‌రీష్ దిగ‌జారుడు రాజ‌కీయం..! భావోద్వేగాలు ఇప్పుడు తావు లేదంటున్న ప్ర‌తిప‌క్షాలు..!

కేసిఆర్ మెప్పు పొందేందుకు హ‌రీష్ రావ్ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మంత్రి స్థాయిలో ఉన్న హ‌రీష్ రావ్ ఒక‌రికి మార్గ‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి ఒక‌రితో చెప్పిచుకునే స్థాయికి దిగ‌జార‌డమేమిట‌ని గులాబి పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ పార్టీ నాయ‌కులు చిన్న చిన్న పొర‌పాట్లు చేస్తే స‌ర్దుకుంటాయి కాని హ‌రీష్ రావ్ స్థాయినేత‌లు పొర‌పాట్లు చేస్తే పార్టీ పైనా ఎంతో ప్ర‌భావం ఉంటుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌ర్చి పోయి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 హ‌రీష్ పై ఈసీ కి ఫిర్య‌దు..! చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్న టీడిపి..!!

హ‌రీష్ పై ఈసీ కి ఫిర్య‌దు..! చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్న టీడిపి..!!

ఉద్య‌మ స‌మ‌యంలో భావోద్వేగాలకు విలువ ఉంటుంది కాని తెలంగాణా ఆవిర్భ‌వించిన త‌ర్వాత ఇలాంటి భావోద్వేగాల‌కు ఎంత వ‌ర‌కు ప్రాముఖ్య‌త ఉంటుంద‌నేది ప్ర‌శ్న‌గా మారింది. హ‌రీష్ రావు వాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా తారా స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యంలో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు స‌ర్వసాధార‌ణ‌మ‌ని, అంతమాత్రాన బాద్య‌తారాహిత్యంగా స‌హ‌నం కోల్పోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు టీడిపి నాయ‌కులు. అంతే కాకుండా హ‌రీష్ వ్యాఖ్య‌ల ప‌ట్ల ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కూడా ఫిర్యాదు చేసారు. ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై విచార‌ణకు ఆదేశిస్తే మాత్రం ఆయ‌న చిక్కుల్లో ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు.

English summary
Telangana minister Haressh Rao forgetting his status and making comments on his rivals. to show loyalty on the party he is committing blunders. In the Gazwel, Oteru Pratap Reddy's remarks were later countering to the comments made by TDP leader Revuri Prakash Reddy. Harish Rao lost his patience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X