వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాచ్ ఫిక్సింగ్, మోడీది తప్పు మాట: టిడిపిపై విరుచుకపడిన కెకె

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు కె. కేశవ రావు శుక్రవారం రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని ఇతర హామీల అమలుకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఎతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం చేత తమ డిమాండ్లను అమలు చేయించుకోవడానికి తెలుగుదేశం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు.

మ్యాచ్ ఫిక్సింగ్ వద్దు, ఆపేయండి

మ్యాచ్ ఫిక్సింగ్ వద్దు, ఆపేయండి


మ్యాచ్ ఫిక్సింగ్‌ను కొనసాగించవద్దని, ఆపాలని కెకె సలహా ఇచ్చారు. ఆర్థిక మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి సభ్యులు సిఎం రమేష్, తోట సీతారామలక్ష్మి, తదితరులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నించుని నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయన ఆ విధంగా అన్నారు

తెలంగాణకు కూడా రాలేదు..

తెలంగాణకు కూడా రాలేదు..


రాష్ట్ర విభజన ఏర్పడిన కొత్త రాష్ట్రం తెలంగాణకు కూడా తగిన వాటా రాలేదని కెకె అన్నారు. అయినప్పటీకి బిక్ష పాత్ర పట్టుకుని కేంద్రం వద్దకు రాలేదని అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు తగిన నిధులు కేటాయించలేదని అన్నారు.

అలా ఇచ్చారు గానీ...

అలా ఇచ్చారు గానీ...


ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన నాలుగేళ్లలో13 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని, తెలంగాణకు మాత్రం 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ప్రజలు తమ వెంట ఉన్నంత వరకు తాము బిక్షాపాత్ర పట్టి అర్థించబోమని అన్నారు.

ఎలా అలా నిలబడుతారు

ఎలా అలా నిలబడుతారు

వెల్‌లో అలా నిలబడడాన్ని ఎలా అనుమతిస్తారని కెకె ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని ఆర్థిక మంత్రికి సూచించాలని ఆయన అన్నారు. ఈ విధమైన నిరసన సభలో సరైంది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు.

English summary
The Telangana Rashtra Samithi (TRS) on Friday accused the Telugu Desam Party (TDP) of "match fixing" with the NDA government to get a special status and other demands as promised for a bifurcated Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X