• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీఆర్ఎస్ కూడా డిపాసిట్ లు కోల్పోయింది..! ఎక్క‌డ..? ఎలా..?

|

హైద‌రాబాద్: తెలంగాణ‌లో గులాబీ పార్టీ డిపాసిట్ లు కోల్పోయింది. ఆశ్య‌ర్య పోతున్నారా..? వింటానికే విచిత్రంగా ఉందా..? కాని ఇది స‌త్యం. అసాద్యాన్ని సుసాద్యం చేసే చ‌తుర‌త ఉన్నా, ప్ర‌త్య‌ర్థి పార్టీలోని హేమాహేమీ నాయ‌కుల‌ను ఒంటిచేత్తో ఎదుర్కొనే సమ‌ర్థ‌త ఎన్న‌ప్ప‌టికి కొన్ని చోట్ల అదికార గులాబీ పార్టీ బోల్తా కొట్టింద‌న్న వార్త తెలంగాణ ప్ర‌జానికాన్ని విస్మ‌యానికి గురిచేస్తోంది. తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రిస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి 2018ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించి 88స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. ప్ర‌తిప‌క్ష పార్టీల అంచ‌నాల‌ను తోసిరాజంటూ అంద‌నంత ఎత్తుకు ఎగ‌బాకింది. ఇంత వర‌కు క‌థ బాగానే ఉన్న‌ప్ప‌టికి కొన్నిచోట్ల అదే పార్టీ అభ్య‌ర్థుల‌కు డిపాసిట్లు కూడా ద‌క్క‌లేదంటే న‌మ్మ‌శ‌క్యం కాని అంశంగా ప‌రిణ‌మించింది. ఇంత‌కీ టీఆర్ఎస్ పార్టీకి డిపాసిట్లు గ‌ల్లంతైనా స్థానాలు ఎక్క‌డ‌..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

 రెండో సారి అదికారంలోకి టీఆర్ఎస్..! కేసీఆర్ కు ఎదురులేదంటున్న నేత‌లు..!

రెండో సారి అదికారంలోకి టీఆర్ఎస్..! కేసీఆర్ కు ఎదురులేదంటున్న నేత‌లు..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నో విచిత్ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కోసం రాష్ట్రంలోని పార్టీలు సన్నద్ధమయ్యే తీరు, అభ్యర్థుల ఎంపిక, బుజ్జగింపులు, జంపింగులు.. ఇలా ఒకటా.. రెండా.. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ నాయకులు మజాను పంచారు. రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠకు తావిచ్చిన తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయఢంకా మోగించింది. దీంతో వరుసగా రెండోసారి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయ‌బోతుంది.

ప్ర‌జా కూట‌మి విఫ‌లం..! మ‌రో సారి గులాబీ పార్టీకి జై కొట్టిన ప్ర‌జ‌లు..!!

ప్ర‌జా కూట‌మి విఫ‌లం..! మ‌రో సారి గులాబీ పార్టీకి జై కొట్టిన ప్ర‌జ‌లు..!!

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమి మాత్రం 21 స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ హైదారాబాద్‌లో సత్తా చాటే ఎంఐఎం ఏడు స్థానాల్లో జెండా ఎగురవేయగా, బీజేపీ ఒక స్థానానికే పరిమితమైంది. రెండు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. టీఆర్ఎస్ ధాటికి ఇతర పార్టీల్లోని సీనియర్లలో చాలా మంది ఓటమి పాలయ్యారు. జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖ, నామా నాగేశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సహా గత ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఓడిపోయారు. ఇక కూటమిలోని తెలంగాణ జనసమితి, సీపీఐ అయితే ఖాతా కూడా తెరవలేకపోయాయి. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు.

 నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ కు డిపాసిట్ లు గ‌ల్లంతు..! ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తున్న నేత‌లు..!

నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ కు డిపాసిట్ లు గ‌ల్లంతు..! ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తున్న నేత‌లు..!

తెలంగాణలో 119 స్థానాలకు గానూ 88 నియోజకవర్గాల్లో విజయకేత‌నం ఎగ‌రేసిన టీఆర్ఎస్ కూడా నాలుగు చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది మాత్రం వాస్త‌వం. హైదరాబాద్ జిల్లాలోని మజ్లిస్ పోటీ చేసిన నాలుగు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేసి గెలిచిన చాంద్రాయణగుట్టలో 1,39,115 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాంరెడ్డికి కేవలం 14,223 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో నియోజకవర్గం చార్మినార్‌లో 1,03,056 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి సలావుద్దీన్‌ లోడికి 6,100 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు.

కొన్ని చోట్ల అంతే..! స‌ర్ధుకుపోవాలంటున్న అదినాయ‌క‌త్వం..!!

కొన్ని చోట్ల అంతే..! స‌ర్ధుకుపోవాలంటున్న అదినాయ‌క‌త్వం..!!

అలాగే కార్వాన్ నియోజకవర్గంలో 1,72,719 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌సింగ్‌‌కు 10,817 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి కౌసర్‌ మొహియుద్దీన్‌ గెలుపొందారు. ఇక చివరి నియోజకవర్గం మలక్‌పేట్‌లో 1,20,443 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్‌కు 17,294 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి అహ్మద్‌ బలాలా జెండా ఎగురవేశారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నా ఈ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది గులాబీ పార్టీ. దీంతో శ‌త్రు ద‌ర్బేద్యం లాంటి పార్టీ కూడా కొన్ని చోట్ల, కొన్ని కార‌ణాల‌వ‌ల్ల నిర్వీర్యం అవుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the Telangana, the party lost its deposit. Is it strange to hear? But that's true. There is no doubt that there is a good sense of insecurity and the ability to fight against senior most leaders in the opposition party, but in some places, the pink party are shocking the Telangana people with loosing deposits in some constitutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more