హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దానం నాగేందర్‌కు గోషామహల్ టిక్కెట్! రాజాసింగ్‌పై సత్తా చూపేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత దానం నాగేందర్‌కు పార్టీ మంగళవారం టిక్కెట్ కేటాయించింది! దాదాపు ఆయనకు టిక్కెట్ ఖరారయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గోషామహల్ నియోజకవర్గం టిక్కెట్ కేటాయించారు. ఈ విషయాన్ని ఈ నెల 13వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.

<strong>టిక్కెట్ రానందుకు బాధగా లేదు, నాకేం ఆసక్తి లేదు, కేసీఆర్‌కే చెల్లింది: దానం</strong>టిక్కెట్ రానందుకు బాధగా లేదు, నాకేం ఆసక్తి లేదు, కేసీఆర్‌కే చెల్లింది: దానం

ఇటీవల కేసీఆర్ 105 సీట్లలో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏడు నియోజకవర్గాలను పెండింగులో పెట్టారు. ఇందులో ఇద్దరు సిట్టింగులకు టిక్కెట్ ఇవ్వలేదు. అయిదు స్థానాలను పెండింగులో పెట్టారు. ఆ స్థానాలకు కూడా ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

అంతలోనే దానంకు టిక్కెట్ కన్‌ఫర్మ

అంతలోనే దానంకు టిక్కెట్ కన్‌ఫర్మ

ఇందులో భాగంగా దానం నాగేందర్‌కు గోషామహల్ టిక్కెట్ కేటాయించారని తెలుస్తోంది. మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. దానం నాగేందర్‌కు తొలి జాబితాలో టిక్కెట్ కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఆయన మాత్రం టిక్కెట్ రాకపోవడంపై తేలిగ్గా కొట్టి పారేశారు. తాను టిక్కెట్ కోసం పార్టీలోకి రాలేదని, బేషరతుగా వచ్చానని చెప్పారు. అంతలోనే ఆయనకు టిక్కెట్ దాదాపు కన్‌ఫర్మ్ అయింది.

గోషామహల్‌లో రాజాసింగ్ లోథ్‌పై బలమైన అభ్యర్థేనా?

గోషామహల్‌లో రాజాసింగ్ లోథ్‌పై బలమైన అభ్యర్థేనా?

నిన్నటి దాకా గోషామహల్ ఎమ్మెల్యేగా బీజేపీ నేత రాజాసింగ్ లోథ్ ఉన్నారు. ఆయన బలమైన నేత. బీజేపీ నుంచే ఆయన మరోసారి పోటీ చేయనున్నారు. ఇక్కడ ఆయనకు గట్టి పట్టు ఉంది. ఇలాంటి నేతపై దానం నాగేందర్ గెలిచి.. నగరంపై తన పట్టు చూపించుకుంటారా? లేక మళ్లీ రాజాసింగ్ గెలిచి తన సత్తా చాటుతారా చూడాలి.

ఖైరతాబాద్ పైన దానం ఆసక్తి

ఖైరతాబాద్ పైన దానం ఆసక్తి

దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. కానీ గోషామహల్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆయనకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ టిక్కెట్ రాకపోవడంపై ఆయన ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగినా.. తాను టిక్కెట్ కోసం రాలేదని, బేషరతుగా చేరానని ఆయన చెప్పడం గమనార్హం. తరుచూ పార్టీలు మారడానికి తాను గంగిరెద్దును కాదని చెప్పారు.

ఉత్తమ్‌ను కలవడంపై ఆసక్తికరం

ఉత్తమ్‌ను కలవడంపై ఆసక్తికరం

తొలి జాబితాలో తనకు టిక్కెట్ రాకపోవడంతో దానం అసంతృప్తికి గురయ్యారని, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారని ప్రచారం సాగింది. దీనిని మాత్రం దానం కొట్టి పారేశారు. మరోవైపు ఉత్తమ్‌ను ఇదే విషయం అడగగా.. దానం నాగేందర్ తనను కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కానీ కలిశారని లేదా కలవలేదని సూటిగా చెప్పలేదు.

English summary
TRS to announce Goshamahal ticket to TRS leader Danam Nagender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X